క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటనపై అమెరికా దౌత్య అధికారులు అసాధారణ నిరసన తెలిపారు. అమెరికా అధ్యక్షుడిపై అసాధారణ నిరసన తెలిపేందుకు వాడే కేబుల్స్ తీర్మానాన్ని రూపొందించారు. దాడికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టడాన్ని ఖండిస్తూ తీర్మానం చేసిన దౌత్య అధికారులు.. 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే ప్రక్రియకు మద్దతు తెలిపారు.
దేశాన్ని కాపాడేందుకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇతర కేబినెట్ సభ్యులు తీసుకునే ఎలాంటి న్యాయపరమైన నిర్ణయానికైనా మద్దతు తెలపాలని దౌత్య, పౌర అధికారులు.. విదేశాంగ మంత్రి మైక్ పొంపియోకు విజ్ఞప్తి చేశారు. క్యాపిటల్ హిల్ లాంటి ఘటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తీర్మానంలో పేర్కొన్నారు. ట్రంప్‌ను బహిరంగంగా జవాబుదారీ చేయకుంటే భవిష్యత్‌లో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, అమెరికా దౌత్య, పౌర అధికారులు తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా విదేశాంగ విధాన లక్ష్యాలను పూర్తి చేయాలన్న యత్నాలపై కూడా ప్రభావం పడుతుందని అన్నారు.
ఇదీ చదవండి : నేడు దిగువ సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం