ETV Bharat / international

టార్గెట్ చైనా: భారీ ప్లాన్​ రెడీ చేస్తున్న ట్రంప్!

చైనాపై అదనపు చర్యలు చేపట్టనున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ చర్యలు ఎలా ఉండనున్నాయనే దానిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కరోనా వైరస్​, హాంగ్​కాంగ్​, టిబెట్​ భద్రతా వ్యవహారాల నేపథ్యంలో శ్వేతసౌధం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

author img

By

Published : Jul 9, 2020, 1:15 PM IST

US considering additional actions against China, confirms WH
చైనాపై భారీ ఆంక్షలకు అమెరికా ప్లాన్​!

అమెరికా-చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. తాజాగా చైనాపై అదనపు చర్యలు చేపట్టడానికి అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. అయితే ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మాత్రం ట్రంప్ సర్కార్ స్పష్టతనివ్వలేదు.

"రానున్న రోజుల్లో చైనాపై చర్యలు చేపడతాం. అయితే అవి ఏమిటనేది మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నుంచే మీరు వింటారు. కానీ నేను ఒకటి చెప్పగలను.. చైనాపై కచ్చితంగా చర్యలు ఉంటాయి."

-- కైలీ మెక్ఎనానీ, శ్వేతసౌధం అధికార ప్రతినిధి.

కరోనా వైరస్​ మహమ్మారి.. ప్రపంచమంతటా వ్యాప్తిచెందడానికి చైనా తప్పిదాలే కారణమంటూ అనేకమార్లు మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. చైనాపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. హాంగ్​కాంగ్​ జాతీయ భద్రతా బిల్లు, అమెరికా జర్నలిస్టులపై ఆంక్షలు, టిబెట్​ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనా ప్రభుత్వంపై విచారణ కోసం..

చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​లో బిల్లును ప్రవేశపెట్టింది 14 మంది చట్టసభ్యుల బృందం. కరోనా సంక్షోభాన్ని అదనుగా తీసుకుని చైనా ప్రభుత్వం చేస్తున్న దోపిడీని గుర్తించి, విశ్లేషించి, ఎదుర్కోవాలని చట్టసభ్యులు బిల్లులో కోరారు.

"ప్రివెంటింగ్​ చైనా ఫ్రం ఎక్స్​ప్లాయిటింగ్​ కొవిడ్​-19 యాక్ట్​"ను ప్రవేశపెట్టారు కాంగ్రెస్​ సభ్యుడు జారెడ్​ గోల్డెన్​. కరోనా సంక్షోభాన్ని లబ్ధి చేసుకునేందుకు.. చైనా చేపడుతున్న చర్యలపై డీఎన్​ఐ(డైరక్టర్​ ఆఫ్​ నేషనల్​ ఇంటిలిజెన్స్​) దర్యాప్తు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని గోల్డెన్​ తెలిపారు. చైనా తీరుతో అమెరికా ఎంత నష్టపోతుందనేది కూడా అంచనా వేయవచ్చన్నారు.

ఇదీ చూడండి- చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.