దిగ్గజ సాంకేతిక సంస్థలైన ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ సీఈఓలు అమెరికా సెనేట్ కామర్స్ కమిటీ ముందు హాజరయ్యారు. కన్జర్వేటివ్‌లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల మధ్య వీరిపై రిపబ్లికన్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సెక్షన్ 230కి సంబంధించిన 'అంతర్జాలంలో స్వేచ్ఛా ప్రసంగం' అంశంపైనే ప్రధానంగా వాదనలు జరిగాయి. కొన్ని ట్వీట్లపై నిషేధం విధించడం సహా కంటెంట్ మోడరేషన్ విషయంలో బహుళ ప్రమాణాలు అవలంబించడంపై సెనేటర్లు ఘాటుగా ప్రశ్నించారు. అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్లపై చైనా కమ్యూనిస్టు పార్టీతో పోలిస్తే ట్విట్టర్ సంస్థే కఠిన వైఖరి చూపిస్తోందని కమిటీ ఛైర్మన్ రోజర్ వికర్ ఆరోపించారు.
సీఈఓలు ఏమన్నారంటే
ట్విట్టర్ కంటెంట్ మోడరేషన్ పాలసీపై ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సీ.. కమిటీ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. తమ విధానాలు త్రీ బకెట్(స్వీయ, కమ్యునిటీ, ప్రజా ప్రచారం)కే సంబంధించినదని స్పష్టం చేశారు.
మరోవైపు, కంటెంట్ మోడరేషన్‌పై ఫేస్బుక్లో 35 వేల మంది పనిచేస్తున్నారని ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. అల్గారిథం వ్యవస్థతో పాటు మనుషులు దీనిపై సంయుక్తంగా పనిచేయడం వల్లే ఏదైనా సమస్యలు తలెత్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
గూగుల్ పబ్లిషర్‌గా వ్యవహరిస్తే.. తమ ప్లాట్‌ఫాంలో వచ్చే కంటెంట్‌కు సంస్థ బాధ్యత వహించేందుకు సిద్ధమేనని చెప్పుకొచ్చారు సుందర్ పిచాయ్.