హెచ్-1బీ వీసాలకు సంబంధించి.. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ణీత పరిమితికి సరిపడా ప్రాథమిక ఎలక్ట్రానిక్ దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. దరఖాస్తులను పరిశీలించి.. సరైన వివరాలు సమర్పించిన వారికి మాత్రమే వీసా జారీ చేస్తుంది యూఎస్‌సీఐఎస్. పరిమితికి లోబడి ర్యాండమ్‌గా ఈ ఎంపిక విధానం ఉంటుంది.
ప్రాథమిక వీసా పిటిషన్‌కు ఎంపికైన వారందరికీ ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చింది యూఎస్‌సీఐఎస్. ఏప్రిల్ 1 నుంచి వారంతా వీసా పిటిషన్ దాఖలు చేసేందుకు అర్హులని వెల్లడించింది.
అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిగించేదే హెచ్1బీ వీసా. ఏటా వేల సంఖ్యలో భారతీయులు ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. సాధారణ వీసా విభాగంలో గరిష్ట పరిమితి 65 వేలు.. అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం గలవారికి ఉద్దేశించిన ప్రత్యేక వీసా విభాగంలో 20 వేల దరఖాస్తులు స్వీకరించామని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:పాస్‌పోర్ట్ లేకున్నా ఓసీఐ కార్డ్ హోల్డర్లకు ఎంట్రీ!