ETV Bharat / international

అమెరికాలో సిక్కులకు ప్రత్యేక గుర్తింపు - అమెరికాలో నివసిస్తున్న సిక్కు మతస్తులకు అరుదైన గుర్తింపు

అమెరికా 2020 యూఎస్​(సెన్సస్​) జనాభా లెక్కల ప్రకారం అగ్రరాజ్యంలోని సిక్కు మతస్తులను ప్రత్యేకమైన  జాతిగా గుర్తించారు. ఈ మేరకు మైనారిటీ వర్గానికి చెందిన ఓ సంస్థ తెలిపింది.  ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం 10లక్షల మంది సిక్కులు అమెరికాలో ఉన్నట్లు వెల్లడించింది.

sikh
అమెరికాలో సిక్కులకు ప్రత్యేక గుర్తింపు
author img

By

Published : Jan 16, 2020, 9:08 AM IST

అమెరికాలో నివసిస్తున్న సిక్కు మతస్తులకు అరుదైన గుర్తింపు లభించింది. 2020 యూఎస్‌ (సెన్సస్) జనాభా లెక్కల ప్రకారం వారిని ప్రత్యేకమైన జాతిగా గుర్తించనున్నట్లు మైనారిటీ వర్గానికి చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ నిర్ణయం పట్ల శాన్‌డిగో సిక్కు సొసైటీ అధ్యక్షుడు బల్జీత్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లనాటి కల, కృషి నెరవేరినట్లు అయిందని ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలోని సిక్కు మతస్తులకు మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలకు సైతం భవిష్యత్తులో ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించేందుకు ఇది ప్రారంభం అని బల్జీత్‌ సింగ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

యునైటెడ్‌ సిక్కులకు చెందిన ఒక బృందం యూఎస్‌ జననగణన అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా శాన్‌డిగో నగరంలో ఈ ఏడాది జనవరి 6న సమావేశం నిర్వహించారు. ‘అమెరికాలో నివసిస్తున్నటువంటి సిక్కు మతస్తుల కచ్చితమైన జనాభా లెక్క ఉండాలంటే వారికి ఒక ప్రత్యేకమైన కోడ్ అవసరమని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వారికి ఈ గుర్తింపు లభించనుంది’ అని యుఎస్ సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ రాన్ జార్మిన్ తెలిపారు.

ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 10 లక్షల మంది సిక్కు జనాభా ఉంది. అమెరికాలోని సిక్కులను ఒక ప్రత్యేక జాతిగా గుర్తించాలని.. వారి జనాభాను నిర్ధరించేందుకు ప్రత్యేక కోడ్‌ ఏర్పాటు చేయాలని గత రెండు దశాబ్దాలుగా సిక్కు మతస్తులు కోరుతున్నారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజిస్ట్రీకి కూడా అనేకసార్లు విన్నపాలు సమర్పించారు.

ఇదీ చూడండి : 'అమెరికా-ఇరాన్​ ఉద్రిక్తతలు తగ్గించటం భారత్​కే సాధ్యం'

AP Video Delivery Log - 0200 GMT News
Thursday, 16 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0156: Guatemala Migrants AP Clients Only 4249568
Groups of migrants enter Guatemala, some detained
AP-APTN-0149: US NY 2020 Bloomberg Women AP Clients Only 4249567
Bloomberg slams Trump on women's issues
AP-APTN-0124: US CA Plane Fuel Cleanup Part must credit Matt Hartman; Part must onscreen credit KTLA, No access Los Angeles, No use by US broadcast networks, No re-sale, re-use or archive 4249565
California schools reopen after jet fuel cleanup
AP-APTN-0033: Philippines Volcano AP Clients Only 4249562
Taal volcano continues to spew ash and smoke
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.