అమెరికాలో 16 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా టీకా అందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ప్రతి అమెరికన్ పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
"ఈరోజు నుంచి దేశంలో 16ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందుతుంది. ఈ వ్యాక్సిన్ సురక్షితం. టీకాతోనే కరోనాను అంతం చేయగలం. మీ వ్యాక్సిన్ తీసుకోండి"
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
18ఏళ్లు దాటిన దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తామని ఏప్రిల్ 7న బైడెన్ చెప్పారు. ఏప్రిల్ 19 లోపు టీకా అందిస్తామన్నారు.
ఇప్పటివరకు అమెరికాలో 3కోట్ల 17 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వైరస్ ధాటికి 5లక్షల 67వేల మంది మరణించారు.
ఇదీ చదవండి : యుద్ధక్షేత్రంలో ఆ దేశ అధ్యక్షుడు మృతి