ETV Bharat / international

చైనా టమాటాలపై అమెరికా నిషేధం.. కారణమిదే - చైనా ఉయ్​గర్లు

చైనా షింజియాంగ్​ స్వయం ప్రతిపత్తి ప్రాంతం నుంచి వచ్చే టమాట, కాటన్​ ఉత్పత్తులపై నిషేధం విధించింది అమెరికా. ఉయ్​గర్​ బందీలను ఆయా ఉత్పత్తుల తయారీలో బలవంతంగా వినియోగించటమే కారణమని స్పష్టం చేసింది.

US bans china products
చైనా టమాటలపై అమెరికా నిషేధం
author img

By

Published : Jan 14, 2021, 10:08 AM IST

Updated : Jan 14, 2021, 10:59 AM IST

అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే కొద్ది రోజుల ముందు చైనాపై మరోమారు ఆంక్షల అస్త్రం సంధించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. చైనాలోని షింజియాంగ్​ ప్రాంతం నుంచి వచ్చే పత్తి, టమాటా ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉయ్​గర్​కు చెందిన ఖైదీలు, బందీలను ఆయా ఉత్పత్తుల తయారీ కోసం బలవంతంగా వినియోగిస్తున్నారనే అభియోగాల మేరకు తాజా నిషేధం విధించినట్లు అగ్రరాజ్య కస్టమ్స్​, సరిహద్దు భద్రతా విభాగం(సీబీపీ) తెలిపింది.

" చైనా షింజియాంగ్​లోని స్వయంప్రతిపత్తి గల ప్రాంతం ఉయ్​గర్​ నుంచి వచ్చే కాటన్​, టమాటా ఉత్పత్తులను సీబీపీ నిషేధించింది. ఈ ఆదేశాలు జనవరి 13 నుంచి అమెరికాలోని అన్ని నౌకాశ్రయాలకు వర్తిస్తాయి. బందీలుగా ఉన్న ఉయ్​గర్​ ప్రాంతీయులను వీటి తయారీ కోసం వినియోగిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. "

- కస్టమ్స్​, సరిహద్దు భద్రతా విభాగం, అమెరికా

కాటన్​, టమాటాలతో పాటు నిషేధం విధించిన ఉత్పత్తుల జాబితాలో దుస్తులు, టమాటా విత్తనాలు, టమాటా సాస్​, వంటకు సిద్ధంగా ఉన్న టమాటాలు, టమాటాలతో చేసిన ఇతర వస్తువులు ఉన్నాయి.

అమెరికాలోకి తక్కువ ధరకే వస్తువులను ఎగుమతి చేసేందుకు చైనా వినియోగిస్తున్న బానిసత్వం, దోపిడీని తాము సహించమని తెలిపారు సీబీపీ యాక్టింగ్​ కమిషనర్ మార్క్​ ఏ మోర్గన్​. మానవ విలువలను గౌరవించే అమెరికా వ్యాపారాలను అది బాధిస్తోందన్నారు. అమెరికా సరఫరా గొలుసులో బలవంతంగా కార్మికులను వినియోగించటాన్ని హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీ విభాగం సహించదని స్పష్టం చేశారు.

చైనాలో రాజకీయ పునరావాస విద్యా కేంద్రాలుగా చెబుతోన్న శిబిరాల్లో 10 లక్షల మందికిపైగా బందీలుగా ఉన్నట్లు సమాచారం. మైనారిటీ ప్రజలను సామూహిక ఖైదు చేసిన ఘటన ప్రపంచంలోనే ఇదే అతిపెద్దదని యావత్​ ప్రపంచం చెబుతోంది.

ఇదీ చూడండి: చైనాను తిప్పికొట్టే శక్తి భారత్‌కే ఉంది: అమెరికా

Last Updated : Jan 14, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.