ETV Bharat / international

మరో 8 చైనా యాప్​లపై అమెరికా నిషేధం​ - చైనా​ యాప్​ల లావాదేవీలపై అమెరికా నిషేధం​

చైనాకు.. అమెరికా మరోసారి షాక్​ ఇచ్చింది. 8 లావాదేవీల యాప్​లను నిషేధిస్తూ అగ్రరాజ్యం ఆదేశాలు జారీ చేసింది. వీటిపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంతకం చేశారు.

US bans China app transactions
చైనా​ యాప్​ల లావాదేవీలపై అమెరికా నిషేధం
author img

By

Published : Jan 6, 2021, 7:12 AM IST

Updated : Jan 6, 2021, 10:37 AM IST

అంతర్జాతీయంగా చైనాకు మరో డిజిటల్ దెబ్బ తగిలింది. జాతీయ భద్రత పరిరక్షణలో భాగంగా ఎనిమిది లావాదేవీల యాప్‌లను నిషేధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇదే తరహాలో గతంలో భారత్.. 200లకు పైగా చైనా యాప్​లను​ నిషేధించడాన్ని ఆయన సమర్ధించారు.

చైనా సృష్టించి, నియంత్రించే ఈ అప్లికేషన్ల వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వీటి రూపకల్పనలో బీజింగ్​తో పాటు హాంకాంగ్​, మకావులకు చెందిన వ్యక్తుల పాత్ర ఉంది. ఈ యాప్​ల నుంచి ఎదురయ్యే ముప్పును అధిగమించడానికి దూకుడు చర్యలు తీసుకోవాలి. గత ఆగస్టులో ప్రముఖ వీడియో యాప్​ టిక్​టాక్​, ప్రధాన వీచాట్​లను నిషేధించడానికి కారణమిదే.

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

నిషేధించిన యాప్​లు..

యాంట్​ గ్రూపునకు చెందిన అలీ పేతో సహా కామ్​స్కానర్​, షేర్​ఇట్​, టెన్సెంట్​ క్యూక్యూ, వీమెట్​, వీచాట్​ పే, క్యూక్యూ వాలెట్​, డబ్ల్యూపీఎస్​ ఆఫీస్​ వంటివి నిషేధిత జాబితాలో ఉన్నాయి. 'స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట‌్లు, కంప్యూటర‌్లు వంటి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలలో ఈ చైనా సాఫ్ట్‌వేర్ యాప్​లు ఉంటాయి. అవి వినియోగదారుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంది. అందుకే మన జాతీయ భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నాం' అని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

భారత్​ ఇటీవల చైనాకు చెందిన 200లకుపైగా యాప్​లను నిషేధించింది. "ఆ అప్లికేషన్లు అనధికారంగా వినియోగదారుల సమాచారాన్ని తస్కరిస్తున్నాయంటూ" భారత ప్రభుత్వం చెప్పిన కారణాన్ని ట్రంప్​ సమర్థించారు. అలాగే అమెరికాలోనూ లక్షల మంది వ్యక్తిగత డేటాను డ్రాగన్​ యాప్​లు సేకరిస్తున్నట్లు అంచనా వేశామని అగ్రనేత పేర్కొన్నారు. ఈ సమాచారం నేరుగా చైనా సైన్యంతో పాటు చైనా కమ్యూనిస్ట్​ పార్టీకి చేరుతుందని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి: రతన్​ టాటా కారు నెంబరుతో మహిళ హల్​చల్​

Last Updated : Jan 6, 2021, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.