ETV Bharat / international

'గోడ' కోసం 275 మిలియన్​ డాలర్ల కాంట్రాక్ట్​ - సరిహద్దు గోడ

అమెరికాలోని అలబామాకు చెందిన కాడెల్​ అనే సంస్థకు 'సరిహద్దు గోడ' నిర్మాణం కాంట్రాక్ట్​ను అప్పగించింది ట్రంప్​ ప్రభుత్వం. ఈ మేరకు 275 మిలియన్​ డాలర్ల నిధులను విడుదల చేసింది. ఈ కాడెల్​ సంస్థ.... టెక్సాస్​లోని లారెడో ప్రాంతం నుంచి 14 మైళ్ల గోడ నిర్మించనుంది. ఈ పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభంకానున్నాయి.

US awards border wall contract in Texas to begin in 2021
'గోడ' కోసం కాంట్రాక్ట్​ ఫిక్స్​.. వచ్చే ఏడాది నుంచి నిర్మాణం
author img

By

Published : May 9, 2020, 1:29 PM IST

మెక్సికో నుంచి వస్తున్న అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​​ ఉపయోగించిన అస్త్రం.. 'సరిహద్దు గోడ'. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా... టెక్సాస్​లో సరిహద్దు గోడ నిర్మాణం కోసం 275 మిలియన్​ డాలర్ల నిధులను కాడెల్​ అనే సంస్థకు అందజేసింది అమెరికా ప్రభుత్వం. నిర్మాణ పనులు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకానున్నాయి.

అలబామాకు చెందిన కాడెల్ సంస్థ.. 14మైళ్ల(22.5కిలోమీటర్ల) సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్​ను దక్కించుకుంది. టెక్సాస్​లోని లారెడో ప్రాంతంలో ఈ నిర్మాణం జరగనుంది.​ ఇక్కడ ఉండే రియో గ్రాండే నది టెక్సాస్​, మెక్సికో మధ్య ప్రవహిస్తుంది.

సీబీపీ(అమెరికా కస్టమ్స్​ అండ్​ బార్డర్​ ప్రొటెక్షన్​) విభాగం శుక్రవారం రాత్రి ఈ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్​ నుంచి అందిన నిధులను ఈ గోడ నిర్మాణం కోసం వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ప్రణాళికాపరంగా అయితే ఈ గొడ నిర్మాణంలో కొంతమేర ప్రైవేటు స్థలాలనూ తీసుకోవాల్సి వస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఓ ఫెడరల్​ కోర్టును సంప్రదించగా... నిర్మాణం కోసం స్థలాలను జప్తు చేయడానికి అనుమతినిచ్చింది న్యాయస్థానం.

ట్రంప్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 162 మైళ్ల సరిహద్దు వెంబడి గోడ నిర్మాణం జరిగింది. ఇంకా 500 మైళ్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో నిర్మాణం పూర్తవుతుందని గతంలో ట్రంప్​ హామీనిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.