ఇంట్లోనే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా.. మరో రెండు టెస్టులకు అమెరికా ఆహార ఔషధ, నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. అబాట్, క్విడెల్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసిన ఈ టెస్టుల ద్వారా ఇంట్లోనే.. వైరస్ సోకిందో లేదో తెలుసుకోవచ్చు.
నాసల్ స్వాబ్ ద్వారా సేకరించిన నమూనాలను టెస్టు స్ట్రిప్‌లో వేస్తే.. 10 నుంచి 20 నిమిషాల్లో ఫలితాలు వెల్లడవుతాయి. తప్పుడు ఫలితాలు రాకుండా ఉండేందుకు తరుచూ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు వీటి ద్వారా పెద్దలు కరోనా పరీక్ష చేయవచ్చు.
ఈ వారంలోనే ఎఫ్‌డీఏ మరిన్ని టెస్టులకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:6 నెలల వరకు ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావం