హాంకాంగ్ స్వయంప్రతిపత్తి వాగ్దానానికి భంగం కలిగించడం సహా.. అక్కడి ప్రజల ప్రాథమిక, మానవ హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఫలితంగా తాజాగా వీసా ఆంక్షలను తెరపైకి తీసుకొచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ)కి చెందిన అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
ఎవరెవరికి వర్తిస్తాయంటే..
అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలనే తాము అమలు చేసినట్లు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. హాంకాంగ్ పరిణామాలకు బాధ్యులుగా గుర్తించిన సీసీపీకి చెందిన ప్రస్తుత, మాజీ అధికారులతో సహా వారి కుటుంబ సభ్యుల వీసాలకు ఆంక్షలు వర్తిస్తాయని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: 'భారత్-అమెరికా బంధంపైనా వీసా ప్రభావం'