ETV Bharat / international

టార్గెట్ చైనా: తైవాన్​కు అమెరికా క్షిపణులు!

తైవాన్​కు 2.37 బిలియన్​ డాలర్లు విలువ చేసే ఆయుధాలు విక్రయించనున్నట్లు వెల్లడించింది అగ్రరాజ్యం. బోయింగ్ సహా అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొద్ది గంటలకే ఈ విషయాన్ని కాంగ్రెస్​కు తెలిపింది ట్రంప్ ప్రభుత్వం.

US announces planned $2.37 billion weapon sale to Taiwan
తైవాన్​కు భారీగా ఆయుధాలు విక్రయించనున్న అమెరికా
author img

By

Published : Oct 27, 2020, 3:28 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్​లో కీలక ప్రకటన చేసింది. తైవాన్​కు 2.37 బిలియన్​ డాలర్లు విలువ చేసే హార్పున్ క్షిపణి వ్యవస్థలను విక్రయించాలనే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపింది. బోయింగ్ సహా అమెరికాకు చెందిన రక్షణ సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొద్ది గంటలకే ఈ వివరాలు వెల్లడించింది ట్రంప్ ప్రభుత్వం.

తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందు అగ్రరాజ్యం కృషి చేస్తోందని, ఆ ప్రాంతంలో భద్రత ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి కీలకమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

"హార్పూన్ క్షిపణులకు ఓడలు, భూఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటుంది. ఇది జీపీఎస్​ ఆధారిత ఇంటర్నల్ నావిగేషన్​ను ఉపయోగించి 500 పౌండ్ల వార్‌హెడ్‌ను ప్రయోగించగలదు" అని బోయింగ్ తెలిపింది.

బోయింగ్​, లాక్​హీడ్ మార్టిన్ సహా అమెరికాకు చెందిన ఇతర రక్షణ సంస్థలపై తైవాన్​కు ఆయుధాలు విక్రయించకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.