ETV Bharat / international

ఆగస్టులో 10.4 లక్షల మందికి ఉద్యోగాలు!

author img

By

Published : Sep 5, 2020, 10:13 AM IST

అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. గత ఆగస్టులో 10.4 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఆ దేశ నిరుద్యోగ రేటు 1.8 శాతం మేర క్షీణించి 8.4 శాతానికి పడిపోయింది. ఒబామా-బైడెన్​ పాలన కాలంలో ఒక నెలలో వచ్చిన కొత్త ఉద్యోగాల సంఖ్యకు ఇది 2.5 రెట్లు అధికమని అధ్యక్షుడు ట్రంప్​ కమ్యూనికేషన్​ డైరెక్టర్​ తెలిపారు.

US adds over 1.4 mn jobs in August,
ఆగస్టులో 10.4 లక్షల మందికి ఉద్యోగాలు!

కరోనా మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోన్నది అనే సంకేతాలు కనబడుతున్నాయి. తాజాగా కార్మిక శాఖ విడుదల చేసిన గణాంకాలే అందుకు నిదర్శనం. నివేదిక ప్రకారం.. గత ఆగస్టులో 10.4 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. దీంతో ఆ దేశ నిరుద్యోగ రేటు 8.4 శాతానికి పడిపోయింది.

ఆగస్టు ఒక్క నెలలోనే భారీగా కొత్త ఉద్యోగాలు రావడం వల్ల నిరుద్యోగ రేటు ఏకంగా 1.8 శాతం మేర క్షీణించి.. 8.4కు చేరినట్లు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 2.8 మిలియన్ల తగ్గి.. 13.6 మిలియన్లకు పడిపోయినట్లు తెలిపింది.

''ఆగస్టులో 1.4 మిలియన్​ ఉద్యోగాలు వచ్చాయి. అది ఒబామా-బైడెన్​ పాలన కాలంలోని ఏ నెలలోనైనా కొత్త ఉద్యోగాల సంఖ్యకు 2.5 రెట్లు అధికం. దాంతో నిరుద్యోగ రేటు మరింత తగ్గింది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో సుమారు 10.6 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. అయితే.. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకుని వారందరికి మళ్లీ ఉద్యోగాలు వచ్చాయి. అయినప్పటికీ ఇంతటితో పని పూర్తికాలేదు. అధ్యక్షుడు ట్రంప్​ విధానాలు.. కరోనా సంక్షోభంపై పోరాడుతూ.. బైడెన్​ అంచనాలను మించి పుంజుకునేందుకు మమ్మల్ని ఆదేశించాయి.''

-టిమ్​ ముర్గాగ్​, ట్రంప్​ 2020 సమాచార శాఖ డైరెక్టర్​.

ఇంటి నుంచి పని చేసే వారి సంఖ్య జులైలో 26.4 శాతం నుంచి ఆగస్టులో 24.3 శాతానికి తగ్గినట్లు నివేదికలో తేలింది. ఇదే క్రమంలో ఆగస్టు నెలలో పలు కారణాల వల్ల విధులు నిర్వర్తించలేకపోయామని 24.2 మిలియన్ల మంది నివేదించారు. ఆ సంఖ్య జులైలో 31.3 మిలియన్లుగా ఉండేది.

ఇదీ చూడండి: అధ్యక్ష ఎన్నికలకు ముందే అమెరికా వ్యాక్సిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.