చైనా, పాకిస్థాన్‌లో మత స్వేచ్ఛ హక్కుల ఉల్లంఘన ఆందోళకర స్థాయిలో ఉందని అమెరికా అభిప్రాయపడింది. అలాంటి పరిస్థితులు ఉన్న 8 దేశాలతో కూడిన జాబితాలో ఈ దేశాలను చేర్చింది.
చైనా, పాకిస్థాన్, మయమ్మార్, ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, ఉత్తర కొరియా, సౌదీ ఆరేబియా, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా దేశాల్లో మత స్వేచ్ఛ నిబంధనల ఉల్లంఘన క్రమబద్ధంగా జరుగుతోందని, దానిని ప్రభుత్వాలు సహిస్తున్నాయని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో అన్నారు.
"మత స్వేచ్ఛ అనేది ఓ హక్కు. ఈ సిద్ధాంతంపైనే స్వేచ్ఛాయుత సంఘాలు నిర్మితమయ్యాయి. ఎదిగాయి. ఈ హక్కును వినియోగించుకోవాలనుకునే వారికి రక్షణగా అగ్రరాజ్యం ఈ చర్యలు చేపట్టింది."
--- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగశాఖ.
కొమొరొస్, క్యూబా, నికరాగువే, రష్యాను ఎస్డబ్ల్యూఎల్(స్పషెల్ వాచ్ లిస్ట్)లో చేర్చింది అమెరికా. మరోవైపు అల్-షాబాద్, అల్‌ఖైదా, బుకొ హరామ్, హయత్ తెహ్రీర్ అల్ షామ్, ది హౌతిస్, ఐసిస్, ఐసిస్-గ్రేటర్ సహారా, ఐసిస్-వెస్ట్ ఆఫ్రికా, జమాత్ నసర్ అల్- ఇస్లామ్‌ను ఆందోళనకర సంస్థలుగా పేర్కొంది.
ఇదీ చూడండి:- సంయుక్తంగా చైనా, పాక్ వైమానిక దళ విన్యాసాలు