ETV Bharat / international

'కరోనా టీకా పంపిణీ కోసం యుద్ధాలు ఆపండి' - ఐక్య రాజ్య సమితి

సిరియా, యెమెన్​ నుంచి సోమాలియా వరకు ప్రధాన సంఘర్షణ ప్రాంతాల్లో లక్షలాది మందికి కరోనా టీకా పంపిణీ కోసం మానవతా దృక్పథంతో సాయుధ పోరాటాలకు విరామం ఇవ్వాలని డిమాండ్​ చేసింది ఐరాస భద్రతా మండలి. ఇందు కోసం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఇది తొలి అడుగేనని, ఇందుకు అంతర్జాతీయంగా మరింత చొరవ అవసరమని ఉద్ఘాటించింది.

UNSC
'కరోనా టీకా పంపిణీ కోసం యుద్ధాలు ఆపండి'
author img

By

Published : Feb 27, 2021, 10:49 AM IST

నిరంతరం బాంబుల మోతలతో అట్టుడికే సిరియా, సుడాన్​ వంటి దేశాల్లో కరోనా టీకా పంపిణీ కోసం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ). ఘర్షణ ప్రాంతాల్లోని లక్షలాది మందికి వ్యాక్సిన్​ అందించేందుకు మానవతా దృక్పథంతో ఆయా దేశాలు సాయుధ పోరాటాలకు విరామం ఇవ్వాలని డిమాండ్​ చేసింది.

ఈ తీర్మానానికి 112 దేశాలు మద్దతు పలికాయి. సిరియా, యెమెన్​ నుంచి సెంట్రల్​ ఆప్రికా రిపబ్లిక్​, మాలి, సుడాన్​, సోమాలియా వరకు ప్రధాన సంఘర్షణ ప్రాంతాల్లో యుద్ధాలకు తక్షణం విరామం ఇవ్వాలని గత ఏడాది జులై 1న యూఎన్​ఏసీ కౌన్సిల్​ చేసిన డిమాండ్​ను పునరుద్ఘాటించాయి సభ్య దేశాలు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని ఘర్షణ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేపట్టాలని కోరినట్లు గుర్తు చేశాయి. ఇదే విషయాన్ని 2020, మార్చి 23న ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ కూడా కోరారు.

వర్చువల్​గా జరిగిన ఈ సమేవశంలో తీర్మానానికి ఈమెయిల్​ ద్వారా వచ్చిన ఓట్లను ప్రకటించారు బ్రిటన్​ ఐరాస రాయబారి, ప్రస్తుత కౌన్సిల్​ అధ్యక్షురాలు.. బార్బరా వూడ్​వర్డ్​. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

"ఈ తీర్మానం సంఘర్షణ ప్రాంతాల్లోని 160 మిలియన్ల మందికి వ్యాక్సిన్​ అందేందుకు దోహదపడుతుంది. మరోవైపు.. ఘర్షణలను దూరం చేస్తుంది. ఇది తొలి అడుగు. దీనికి అంతర్జాతీయంగా మరింత చొరవ అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాలతో పాటు స్థానిక స్థాయిల్లో మరిన్ని చర్చలు జరగాలి. "

- బార్బరా వూడ్​వర్డ్​, యూఎన్​ఎస్​సీ అధ్యక్షురాలు

సాయుధ పోరాటాలు కొవిడ్​-19 మహమ్మారి ప్రభావాన్ని పెంచుతాయని, మరోవైపు.. సాయుధ పోరాటాలతో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాన్ని, అసమానతలను కరోనా పెంచుతుందని సభ్య దేశాలు పేర్కొన్నాయి. వైరస్​ను అంతమొందించేందుకు అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్​ అందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశాయి. పేద, మధ్య ఆదాయ దేశాలకు ధనిక దేశాలు వ్యాక్సిన్లను విరాళంగా అందించాలని పిలుపునిచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కొవాక్స్​ ద్వారా లేదా ఏ ఇతర మార్గంలోనైనా సాయం చేయాలని కోరాయి.

ఇదీ చూడండి: యూఎన్‌ఎస్‌సీలో భారత్​ శాశ్వత సభ్యత్వానికి చైనా మోకాలడ్డు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.