ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పాఠశాలల్లో చేతులను శుభ్రం చేసుకోవటానికి అవసరమైన నీరు, సబ్బు వంటి సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రస్తుత కరోనా విజృంభణలో పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వాలు యోచిస్తున్న తరుణంలో ఓ నివేదికను విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 818 మిలియన్ల మంది విద్యార్థులకు చేతులు కడుక్కోవటానికి సరైన సదుపాయాలు లేవని తెలిపింది. వీరిలో మూడింట ఒక వంతు మంది చిన్నారులు సబ్ సహారన్ ఆఫ్రికాలోనే ఉన్నారని తెలిపింది. పాఠశాలలు తిరిగి ప్రారంభించే సమయంలో ఆర్థిక, సామాజిక విషయాలతో పాటు ఆరోగ్య సదుపాయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. మూడింట ఒకవంతు పాఠశాల్లో తాగునీరు సదుపాయాలు పరిమితంగా లేదా అసలు లేవని పేర్కొంది.
ఇదీ చూడండి:తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!