అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) తుది జాబితా నుంచి 19 లక్షల మంది పేర్లు గల్లంతైన వేళ ఐక్యరాజ్యసమితి స్పందించింది. పేర్లు రాని వారినెవరినీ పౌరసత్వం లేని వ్యక్తులుగా చూడొద్దని భారత్‌ను కోరింది ఐరాస.
జాతీయత లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలను వదిలివేసే ఏ ప్రక్రియ అయినా... పౌరసత్వలేమిని అడ్డుకునే తమ ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
'న్యాయసాయం అందించండి'
భారత్ ఇప్పుడే ఎవరినీ పౌరసత్వం లేనివారిగా నిర్ధరించవద్దని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఫిలిప్పో గ్రాండి కోరారు. జాబితాలో లేనివారందరికీ కావాల్సిన న్యాయసాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఎన్ఆర్సీ జాబితాలో 3 కోట్ల 11 లక్షల మందికి చోటు దక్కింది. మరో 19 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఎన్‌ఆర్‌సీలో 19.06 లక్షల మందికి దక్కని చోటు