ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు యూఎన్ జనరల్ అసెంబ్లీ సిద్ధమైంది. ఎన్నికలో పోటీ చేసే.. అభ్యర్థుల దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. కౌన్సిల్ అధ్యక్షుడు తారిక్ లాడేబ్ యూఎన్‌లోని 193 దేశాల అధినేతలకు లేఖ రాయనున్నారు. జనవరి 31లోపు లేఖలు పంపనున్నట్లు యూఎన్ అధ్యక్షుడు వోల్కాన్ బోజ్కిర్ తెలిపారు. భద్రతామండలిలోని 15మంది సభ్యుల సిఫార్సు అనంతరం.. యూఎన్ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. అయితే ఐక్యరాజ్యసమితిలో వీటో పవర్ ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాల మద్దతు కీలకం కానుంది. ఇప్పటికే బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు తన మద్దతు తెలిపారు. కానీ మిగతా నాలుగు దేశాలు దీనిపై స్పందించలేదు.
ప్రధాన కార్యదర్శి ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు... రానున్న ఐదు ఏళ్లలో తమ లక్ష్యాలను కౌన్సిల్‌కు తెలపాలని అధ్యక్షుడు వోల్కాన్ బోజ్కిర్ అన్నారు. అనంతరం ప్రశ్న-జవాబు కార్యక్రమం ఉంటుందన్నారు. అయితే అభ్యర్థులను ప్రకటించటానికి సభ్య దేశాలకు ఎలాంటి గడువులేదన్నారు.
ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు అనుమతిస్తే..తాను రెండోసారి పదవిలో కొనసాగుతానని ప్రస్తుత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇదివరకే యూఎన్ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గుటెరస్ 2017, జనవరి 1 న ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి : మరోసారి ఆ పదవిలో కొనసాగుతా: గుటెరస్