పెగసస్ హ్యాకింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా స్పైవేర్ వినియోగాన్ని నియంత్రించే మరిన్ని సమర్థమైన నిబంధనలను అమలు చేసే వరకు నిఘా సాంకేతికత అమ్మకం, బదిలీపై నిషేధం విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అప్పటివరకు మానవ హక్కులను దెబ్బతీయకుండా చూసుకోవాలని సూచించింది.
ఈ క్రమంలో "మానవ హక్కుల రక్షకులు, పాత్రికేయులు, రాజకీయ ప్రత్యర్థులను నిఘా ఉంచడానికి.. వారిని అణచివేయడానికి అత్యంత అధునాతన అనుచిత సాధనాలు ఉపయోగిస్తున్నారు" అని ఐరాస మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
గత నెలలో గ్లోబల్ మీడియా కన్సార్టియం జరిపిన విచారణలో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ అసంతృప్తులపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించినట్లు వెల్లడైంది.
ఇదీ చూడండి: అమెరికాలో కరోనా ఉగ్రరూపం- చైనాలో ఇళ్లకు తాళాలు