ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్లు పుతిన్ చేసిన ప్రకటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యా దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. రష్యా యుద్ధాన్ని కోరుకుందని.. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనిపై నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. రష్యాను ప్రపంచం బాధ్యుల్ని చేస్తుందని స్పష్టం చేశారు.
"ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రజల కోసం ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి ఉక్రెయిన్ ప్రజలు రష్యా సైనిక దాడులకు బాధితులుగా మారుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని కోరుకున్నారు. ఇది తీవ్ర ప్రాణనష్టానికి దారితీస్తుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. రేపు జీ7 దేశాధినేతలతో చర్చిస్తాం. నాటో భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకుంటాం."
-జో బైడన్, అమెరికా అధ్యక్షుడు
ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్‌లో పేలుడు