ETV Bharat / international

ట్రంప్​ ఎఫెక్ట్​: సోషల్ మీడియా సంస్థలు నష్టాల్లోకి.. - పడిపోయిన ట్విట్టర్ షేర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వ్యక్తిగత​ ఖాతాను శాశ్వతంగా నిషేధించటం వల్ల సోమవారం ట్విట్టర్​ షేర్స్ 6.4 శాతం​ పడిపోయాయి. ఫేస్​బుక్ షేర్లు సైతం సోమవారం 4 శాతం తగ్గాయి. ట్రంప్​..తన ట్వీట్ల ద్వారా అగ్రరాజ్యంలో హింసను ప్రేరేపిస్తున్నారన్న కారణంగా ట్విట్టర్​తో పాటు పలు సోషల్​ మీడియా సంస్థలు ఆయన ఖాతాలపై చర్యలు తీసుకున్నాయి.

Twitter without Trump tumbles along with other tech shares
ట్రంప్​ ఖాతా లేని సోషల్ మీడియా సంస్థలు నష్టాల్లోకి..
author img

By

Published : Jan 12, 2021, 2:25 PM IST

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాను నిషేధించడం వల్ల సోషల్​ మీడియా సంస్థల షేర్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించటం వల్ల ట్విట్టర్ షేర్లు సోమవారం 6.4 శాతం పడిపోయాయి. అటు ఫేస్​బుక్​ షేర్లు సైతం 4 శాతం తగ్గాయి. అమెరికా క్యాపిటల్​ భవనంపై దాడికి ట్రంప్​.. తన ట్వీట్ల ద్వారా మద్దతుదారులను రెచ్చగొట్టారన్న కారణంతో ఆయన వ్యక్తిగత ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించింది. ట్విట్టర్​ ఖాతాలో ఆయనకు 89 మిలియన్ల ఫాలోవర్స్​ ఉన్నారు. ఫేస్​బుక్​ ఈ నెల 20 వరకు ట్రంప్​ ఖాతాను స్తంభింపజేసింది.

అయితే ట్విట్టర్​ నిర్ణయానికి ట్రంప్​.. తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 'త్వరలో మనం కొత్త ఫ్లాట్​ఫామ్​ను రూపొందిద్దామని' అభిమానులను ఉద్దేశించి అన్నారు. ట్విట్టర్​, ఫేస్​బుక్​తో పాటు ఇతర సోషల్​ మీడియా సంస్థల షేర్లు సైతం సోమవారం తగ్గుముఖం పట్టాయి. యాపిల్, అమెజాన్​, ఆల్ఫాబెట్​ సంస్థల షేర్లు సోమవారం 2 శాతానికి పైగా తగ్గాయి. క్యాపిటల్​ ఘటనకు సంబంధం ఉందన్న ఆరోపణల మధ్య పార్లర్​ అనే యాప్​ను గూగుల్, యాపిల్​ స్టోర్​ నుంచి తొలగించాయి.

మరోవైపు సోషల్​ మీడియా సంస్థల చర్యలను ట్రంప్ మద్దతుదారులు తప్పుబట్టారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లేనని అన్నారు.

ఇదీ చదవండి : ట్రంప్​కు ఫేస్​బుక్, ట్విట్టర్ వరుస షాకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.