జపాన్‌లో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఈ మేరకు జపాన్ వినియోగదారులు ఆ సంస్థకి ఫిర్యాదు చేశారు. దీనికి స్వందిస్తూ ట్విట్టర్, ట్వీట్‌డెక్ గల అంతరాయాన్ని తాము ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. సమస్యకు గల కారణాలను వెల్లడించలేదు.
"ప్రస్తుతం అంతరాయానికి గల కారణాలను పరిష్కరిస్తున్నాం, త్వరలోనే సేవలు యథావిధిగా కొనసాగుతాయి. "
-ట్విట్టర్ సంస్థ
అమెరికా, బ్రిటన్, భారత్‌తో సహా 6 ఖండాల నుంచి దాదాపు 3,200 ఫిర్యాదులు వచ్చిన్నట్లు ట్విట్టర్ పర్యవేక్షణ సైట్ తెలిపింది. సగం మందికి పైగా మూడు నెలల నుంచి పూర్తిగా యాప్ పనిచేయట్లేదని, వెబ్సైట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని ఫిర్యాదు చేశారు. కొంతమంది వినియోగదారులు యాప్ అడపాతడపా పనిచేస్తుందని, దానికి ట్విట్టర్ డౌన్ అని హ్యాష్‌ట్యాగ్ జత చేసి పోస్ట్ చేస్తున్నారు.
ఆగస్టు నెలలోనూ హ్యాకర్లు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సి ఖాతాను హ్యాక్ చేసి వరుసగా జాత్యాహంకార, విద్వేషపూరితమైన ట్వీట్లను పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి: అభిశంసన తీర్మానం ఓ తెలివితక్కువ పని: ట్రంప్