ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ సేవలకు అంతరాయం

బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాల్లోని వినియోగాదారులు దాదాపు గంటపాటు ఈ సమస్య ఎదుర్కొన్నారు. అయితే, ఈ విషయంపై ట్విట్టర్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

author img

By

Published : Aug 22, 2019, 6:26 AM IST

Updated : Sep 27, 2019, 8:27 PM IST

ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ సేవలకు అంతరాయం

సామాజిక మాధ్యమాల దిగ్గజం ట్విట్టర్ సేవలకు బుధవారం గంటపాటు అంతరాయం కలిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడిందని వెబ్​సైట్ల వైఫల్యాలను గుర్తించే సంస్థ డౌన్​డిటెక్టర్ వెల్లడించింది. భారత్​, జపాన్, బ్రిటన్, దక్షిణ అమెరికా, ఐరోపా, ఉత్తర అమెరికాల్లోని ట్విట్టర్ వినియోగదారులకు ఈ సమస్య ఎదురైనట్లు తెలిపింది.

ఈ సమయంలో ట్విట్టర్​ యాప్​ ఓపెన్​ చేసిన వారికి 'సమ్​థింగ్ వెంట్​ రాంగ్, ట్రై అగైన్' అనే వాక్యం దర్శనమిచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు సాఫ్ట్​వేర్లలోనూ ఈ అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ట్విట్టర్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అనంతరం సేవలు పునఃప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: హైడ్రామాకు సీబీఐ బ్రేక్​.. చిదంబరం అరెస్టు

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.