ETV Bharat / international

'ట్రంప్​ బెదిరింపుల్లో నాటి జాతి విద్వేష భాష' - us prez donald trump latest news

అమెరికాలో ఫ్లాయిడ్​ హత్యకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలపై అధ్యక్షుడి స్పందన జాతి వివక్ష విధానానికి దగ్గరగా ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. 1967లో నల్లజాతీయులను తీవ్రంగా అణచివేసిన పోలీస్ అధికారి వాల్టర్​ తరహాలోనే ట్రంప్ ప్రకటన ఉందని విమర్శించారు.

US-PROTESTS-TRUMP-UN-EXPERTS
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్
author img

By

Published : Jun 7, 2020, 5:30 AM IST

ఆఫ్రో అమెరికన్​ జార్జి ఫ్లాయిడ్ హత్యతో చెలరేగిన నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ స్పందన సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై భిన్న వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సమయంలో ఆయన వాడిన భాష గతంలో అమెరికాలో కొనసాగిన జాతి వివక్షకు దగ్గరిగా ఉందని ఐరాస మానవ హక్కుల నిపుణులు విమర్శించారు.

ఫ్లాయిడ్​ మృతితో అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. చాలా మంది రోడ్లపైకి వచ్చిన ఆందోళన చేపట్టారు. పలుచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. కొన్ని చోట్ల దుకాణాల్లో లూటీలు జరిగాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ "లూటీలు ప్రారంభిస్తే కాల్చేస్తాం" అని హోదాను మరిచి ట్విట్టర్​ వేదికగా స్పందించారు ట్రంప్​.

ఐరాస నిపుణులు ఆవేదన..

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఐరాస మానవహక్కల మండలికి చెందిన 60 మంది నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇలాంటి భాషను గతంలో జాతి వివక్షను అవలంబించే వేర్పాటువాదులు ఉపయోగించేవారు. నల్లజాతీయుల హక్కులను కాలరాసేందుకు తీవ్రంగా కృషి చేసినవారు దీనిని కాదనలేరు. ఆయన వ్యాఖ్యల వల్లనే నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అన్యాయాన్ని ఎదురించేందుకు చేస్తోన్న నిరసనలపై సైన్యంతో అణచివేయాలన్న ఆలోచన విధానంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం."

- ఐరాస నిపుణుల ప్రకటన

వాల్టర్ భాష వాడిన ట్రంప్​..

ట్రంప్​ స్పందన గతంలో మియామీ మాజీ పోలీస్​ అధికారి వాల్టర్ హెడ్లీని గుర్తుకు తెస్తోందని న్యూయార్క్​ టైమ్స్​ వ్యాఖ్యానించింది. 1967లో వాల్టర్ కూడా​ ఇదే రీతిలో.. "లూటీలు చేస్తే కాల్చేస్తాం" అని ప్రకటన చేశాడు. నల్లజాతీయులకు వ్యతిరేకంగా జాతి వివక్షత వ్యూహాలను అవలంబించాడని వాల్టర్​పై ఆరోపణలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

"ఫ్లాయిడ్​ హత్యతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. కానీ, అమెరికావ్యాప్తంగా నల్లజాతీయులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. జాతీయవాదం ముసుగులో జాతి వివక్షను వ్యవస్థీకృతం చేశారు. ఫలితంగా జాతి వివక్ష అనేది హింసాత్మక రూపాన్ని తీసుకుంది. ఈ హింసకు అమెరికాలో శిక్షలేదు. ఇది ఎవరో కొందరు చేసిన తప్పు కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతో ముడిపడి విదేశీయులు ముఖ్యంగా నల్లజాతీయులపై వివక్ష వేళ్లూనుకుంది."

- ఐరాస నిపుణులు ప్రకటన

100 ఏళ్లయినా మారని హింస..

దేశంలో వ్యవస్థాగత జాతి వివక్ష, పక్షపాతంపై క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని వీరిలోని 28 మంది సభ్యులు కోరారు. పోలీసులు దౌర్జన్యం చేసిన ఘటనల్లో స్వతంత్ర విచారణ జపిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

"తుల్సాలో ఆఫ్రికన్ల ఊచకోత జరిగి 99 ఏళ్లు గడిచాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నల్లజాతీయుల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ సహకారంతోపాటు వ్యక్తిగత కారణాలతో ఆఫ్రికన్ అమెరికన్లు ఇప్పటికీ హింసకు గురవుతున్నారు. అహ్మద్ ఆర్బరీ, బ్రెన్నా టేలర్, జార్జి ఫ్లాయిడ్​ హత్యలను ఖండించాల్సిందే. నల్లజాతీయులకు న్యాయం జరిగేందుకు వ్యవస్థాగత సంస్కరణలు రావాల్సి ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న పరిస్థితుల వల్ల వీరంతా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది."

- ఐరాస నిపుణులు

25 ఏళ్ల టేలర్​ అత్యవసర వైద్య సేవల ఉద్యోగిగా సేవలందించేవాడు. పొరపాటున అతని ఇంటికి వెళ్లిన పోలీసులు టేలర్​ను బెడ్​ మీదనే కాల్చిచంపారు. ఆర్బరీని ఉదయం పూట వాకింగ్ చేస్తుండగా ముగ్గురు తెల్లజాతీయులు చుట్టుముట్టి కాల్చిచంపారు. ఇలా అనాదిగా అమెరికాలో ఇదే పరంపర కొనసాగుతోంది. ఆధునిక కాలంలోనూ ఈ సమస్య పెనుభూతంలా వేధిస్తూనే ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా నిరసనలపై పోలీసులు స్పందించిన తీరుపైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్ణాల ఆధారంగా లక్ష్యం చేసుకుని అరెస్టు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కొంతమంది జర్నలిస్టులను కూడా వేధించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: వేలాదిమంది సాయుధ సైనికుల్ని దించుతా: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.