ETV Bharat / international

గందరగోళం, అపఖ్యాతి మధ్య ట్రంప్​ 'వీడ్కోలు'

అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేసే సమయానికి ట్రంప్​ శ్వేతసౌధాన్ని వీడతారు. అయితే ఏ అధ్యక్షుడైనా ఘన కీర్తితో పదవికి వీడ్కోలు పలకాలనుకుంటారు. కానీ ట్రంప్​ ప్రస్థానం అందుకు భిన్నం. తీవ్ర గందరగోళం నడుమ శ్వేతసౌధానికి ట్రంప్​ వీడ్కోలు చెప్పనున్నారు.

Trumps exit: President leaves office with legacy of chaos
గందరగోళం మధ్య శ్వేతసౌధానికి ట్రంప్​ 'వీడ్కోలు'
author img

By

Published : Jan 20, 2021, 4:45 PM IST

అధ్యక్షుడిగా ట్రంప్​ ప్రస్థానం ముగిసింది. జో​ బైడెన్​ ప్రమాణస్వీకారం చేసే సమయానికి ట్రంప్​.. ఫ్లోరిడాలోని తన మార్​-ఏ-లాగో బీచ్​ క్లబ్​కు చేరుకుంటారు. అయితే ఏ అధ్యక్షుడైనా తన పదవీకాలాన్ని ఘనంగా ముగించాలని అనుకుంటారు. కానీ ట్రంప్​ కథ మాత్రం ఇందుకు భిన్నం. ట్రంప్​ శ్వేతసౌధాన్ని వీడుతున్నది గందరగోళం మధ్య కాబట్టి.

'క్యాపిటల్​'తో...

అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​ నాలుగేళ్ల పదవీకాలం ఓవైపు ఉంటే.. ఈ జనవరి 6న జరిగిన క్యాపిటల్​ హింసాకాండ మరోవైపు నిలుస్తుంది. అంతకుముందు.. ఎన్నికల్లో అవకతవకలపై ట్రంప్​ ఎన్ని అసత్య ఆరోపణలు చేసినప్పటికీ అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ క్యాపిటల్​ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అమెరికా చరిత్రలోనే చీకటి రోజుగా భావిస్తున్న జనవరి 6న.. వేలాది మంది ట్రంప్​ మద్దతుదారులు క్యాపిటల్​లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:- ప్రమాణ స్వీకారానికి 'డుమ్మా' జాబితాలో ట్రంప్​

రిపబ్లికన్లలో చీలిక...

అప్పటివరకు ప్రతి విషయంలోనూ ట్రంప్​కు మద్దతుగా నిలిచిన రిపబ్లికన్​ పార్టీ ఆ తర్వాత.. రెండుగా చీలిపోయింది. తన మద్దతుదారులను ట్రంప్​ ప్రేరేపించారంటూ ఆరోపణలను పెరిగిపోయాయి.

ఈ తరుణంలో ట్రంప్​కు ఆయన సన్నిహితులు పలు సూచనలు చేశారు. అధ్యక్షుడిగా చివరిరోజుల్లో.. తన పదవీకాలంలోని ఘనతలను ప్రచారం చేయాలన్నారు. వీటిని కూడా లెక్కచేయని ట్రంప్​.. టెక్సాస్​ సరిహద్దుకు మాత్రం వెళ్లివచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకు 'మనం మొదలుపెట్టిన ఉద్యమానికి ఇది ఆరంభం మాత్రమే..' అంటూ తన మద్దతుదారులకు వీడియోను విడుదల చేశారు.

ఇదీ చూడండి:- ట్రంప్​పై విమర్శల జడివాన స్వయంకృతమే!

క్యాపిటల్​ ఘటనతో మరో విధంగానూ ట్రంప్​ నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. వాస్తవానికి 2020లో ఓడింది ట్రంప్​ ఒక్కరే.. ట్రంపిజం కాదు. ఆయన పేరుతో ఎందరో రిపబ్లికన్లు విజయం సాధించారు. ఫలితంగా 2024లోనూ.. రిపబ్లికన్ల తరఫున ఆయనే అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఉండే అవకాశముందని భావించారు. కానీ క్యాపిటల్​ హింసాకాండతో ఇది కూడా సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

ఒంటరిగా వచ్చి.. ఒంటరిగానే..

అయితే ట్రంప్​ తన పదవీకాలాన్ని ఎలా మొదలుపెట్టారో.. అదే విధంగా ముగించారు. దాదాపు అంతా ఒంటరిగానే గడిపారు.

రిపబ్లికన్ల వ్యతిరేకతతో ప్రస్తుతానికి ట్రంప్​ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలోకి పడిపోయింది. అయితే సొంత పార్టీపై తిరుగుబాటు చేసి తదుపరి ఎన్నికల్లో మూడో పార్టీ నుంచి అభ్యర్థిగా ట్రంప్​ నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:- ట్రంప్‌ రాజేసిన నెగళ్లు! అమెరికాలో విద్వేష విషధూమం

ఈ పరిస్థితుల్లోనూ రిపబ్లికన్లప్​ ట్రంప్​ తన పట్టును కోల్పోలేదని మరికొందరు భావిస్తున్నారు. మిలియన్ల మంది ఓటర్ల మద్దతుతో పాటు రిపబ్లికన్​ నేషనల్​ కమిటీలో తన సన్నిహితులు ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

వాషింగ్టన్​లో..

మొత్తానికి 'వీ మిస్​ యూ ట్రంప్​' అనే వాళ్లు అధ్యక్షుడి వెనుక లేరు. వాషింగ్టన్​ నుంచి తన నాలుగేళ్ల పాలనను సాగించారు ట్రంప్​. అయినప్పటికీ నగర ప్రజలు ఆయన్ను మిస్​ అవ్వడం లేదు. ఇందుకూ కారణం ఉంది. ట్రంప్​ శ్వేతసౌధాన్ని వీడింది చాలా అరుదు. అందులోనూ ఆయన ఏ స్థానిక హొటల్​లోనూ ఎన్నడూ భోజనం చేయలేదు. ప్రథమ మహిళ కూడా ఇంతే. ట్రంప్​ ఎప్పుడూ దూకాణాల్లో షాపింగ్​ చేయలేదు. ట్రంప్​ ఎప్పుడైనా బయటకు వెళ్లి ఉంటే.. అది ఆయన గోల్ఫ్​ క్లబ్​కు లేదా పామ్​ బీచ్​కు మాత్రమే.

ఇదీ చూడండి:- అధ్యక్షుడిగా ట్రంప్ ఖాతాలో మరో చెత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.