ETV Bharat / international

'ట్విట్టర్​లో వాళ్లను బ్లాక్​ చేస్తా.. అనుమతివ్వండి' - trump twitter account controversy

వ్యక్తిగత ట్విట్టర్​ ఖాతాను అనుసరిస్తూ తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిని బ్లాక్​ చేసేందుకు అనుమతివ్వాలని అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్విట్టర్​లో తమను బ్లాక్​ చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పలువురు విమర్శకులు కోర్టులో సవాల్ చేశారు.

Trump wants SCOTUS OK to block critics
'నా ట్విట్టర్​ ఖాతా నుంచి వాళ్లను బ్లాక్​ చేస్తా.. అనుమతివ్వండి'
author img

By

Published : Aug 21, 2020, 12:41 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వ్యక్తిగత ఖాతా నుంచి విమర్శకులను బ్లాక్​ చేసేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నట్లు తెలిపింది ఆయన పరిపాలనా విభాగం. ట్విట్టర్​ ఖాతాలో ఉండే అన్ని ఆప్షన్స్​ ను వినియోగించుకునే స్వేచ్ఛ.. ట్రంప్​కు ఉందని, అధికారిక కార్యాలయానికి దీనితో సంబంధం లేదని వివరిస్తూ ఓ తీర్పును సమీక్షించాలని హైకోర్టులో విజ్ఞప్తి చేశారు ట్రంప్​ తరఫు న్యాయవాది.

ట్రంప్ ట్విట్టర్​ ఖాతాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు, పరీశీలనలు వెల్లడిస్తున్నారని.. అందువల్ల విమర్శకులను బ్లాక్​ చేయడానికి వీల్లేదని న్యూయార్క్​లోని న్యాయస్థానం గతేడాది తీర్పునిచ్చింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న విమర్శకుల అభిప్రాయాలతో విభేదించి, వారిని బ్లాక్ చేయడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

తీర్పును సమీక్షించాలనే ట్రంప్​ వినతిని అంగీకరించవద్దని అయన ట్విట్టర్ ఖాతాలో బ్లాక్​కు గురైన ఏడుగురు విమర్శకులు కోర్టును కోరారు. వీరి తరఫున కొలంబియా యూనివర్సిటీకి చెందిన నైట్​ ఫస్ట్ అమెండ్​మెంట్​ ఇనిస్టిట్యూట్ పిటిషన్​ దాఖలు​ చేసింది. ప్రజాభిప్రాయాలను అధికారిక ఖాతాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విమర్శకులను బ్లాక్​ చేయడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడమేనని పేర్కొంది.

సుప్రీంకే అధికారం..

అయితే అధ్యక్షుడి వ్యక్తిగత నిర్ణయాలు, ప్రవర్తనపై నిర్ణయం తీసుకునే అధికారం దిగువ కోర్టులకు లేదని, సుప్రీంకోర్టు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ట్రంప్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల వరకు ట్రంప్​ వినతిపై కోర్టు విచారణ చేపట్టే అవకాశాలు కన్పించడం లేదు. కరోనా కారణంగా విచారణ ఆలస్యమవుతోంది.

ఇదీ చూడండి: నామినేషన్​ను అధికారికంగా అంగీకరించిన బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.