ETV Bharat / international

వ్యవస్థలపై ట్రంప్ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

author img

By

Published : Dec 3, 2020, 9:30 AM IST

ట్రంప్‌ పదవిని చేపట్టడం, చేజార్చుకోవడం రెండూ వివాదాలుగానే మిగిలాయి. రష్యా జోక్యంతో కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు పడటం వల్లే ట్రంప్‌ విజయం సాధించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇప్పుడేమో భారీ రిగ్గింగ్‌ వల్లే బైడెన్‌ గెలిచారని గొంతు పగిలిపోయేలా అరిచి అల్లర్లు సృష్టించి ట్రంప్‌ అల్లకల్లోలం చేస్తున్నారు. ఎన్నికలు అత్యంత సురక్షితంగా జరిగాయని పేర్కొన్న హోంశాఖ ఉన్నతాధికారిని పదవి నుంచి తొలగించారు. తన అధికారం అవసాన దశకు చేరుకుందనే సత్యం అతి కష్టం మీద బుర్రకెక్కుతుంటే చిత్తచాపల్యం పెరిగి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు.

trump ugliness on systems  dangerous for democracy
వ్యవస్థలపై ట్రంప్ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

ట్రంప్‌ ప్రస్తుత పరిస్థితిని ఆయన సన్నిహితుడొకరు వాస్తవానికి కాస్త దగ్గరగా ‘ద వాషింగ్టన్‌ పోస్ట్‌’కు వివరించారు. పద్దెనిమిదో శతాబ్దంలో రాజకీయ తిరుగుబాట్ల మధ్య మతిభ్రమించిన గ్రేట్‌ బ్రిటన్‌ చక్రవర్తి మూడో కింగ్‌ జార్జిలాగా ఇప్పుడు తమ అధ్యక్షుడు ఉన్నార[ని అనధికారికంగా ఆయన వాపోయారు. ‘నేనే గెలిచాను... నేనే గెలిచాను’ అని గొణుక్కుంటూ, తిట్టుకుంటూ వైట్‌హౌస్‌ చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ మాటలను నిజం చేస్తున్నట్లే ఉంది ప్రెసిడెంట్‌ ప్రవర్తన. పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం నుంచి తనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్‌ ఇప్పుడు కోర్టులనూ తప్పుపడుతున్నారు. తగిన సాక్ష్యాధారాలను సమర్పించుకునే అవకాశం తమకు ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆధారరహితమైన ఆరోపణలతో వందల కేసులు వేసి ప్రతికూల ఫలితాలు రావడంతో అడ్డూఅదుపూ లేకుండా అన్ని వ్యవస్థలనూ ఆడిపోసుకుంటున్నారు. అసహనం పెరిగిపోయి అసాధారణ, అనారోగ్యకర మానసిక స్థితితో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలు, అన్యాయాలు జరిగినప్పటికీ తనకు అనుకూలంగా ఎఫ్‌బీఐ ఒక్క ప్రకటనా చేయలేదని, ఆ సంస్థ క్రియాశీలత కోల్పోయిందని తిట్టిపోస్తున్నారు. ఓడిపోయిన ప్రతిచోటా ఉన్న అధికారులను తనకు వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.

ట్రంప్‌ పదవిని చేపట్టడం, చేజార్చుకోవడం రెండూ వివాదాలుగానే మిగిలాయి. రష్యా జోక్యంతో కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు పడటం వల్లే ట్రంప్‌ విజయం సాధించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇప్పుడేమో భారీ రిగ్గింగ్‌ వల్లే బైడెన్‌ గెలిచారని గొంతు పగిలిపోయేలా అరిచి అల్లర్లు సృష్టించి ట్రంప్‌ అల్లకల్లోలం చేస్తున్నారు. ఎన్నికలు అత్యంత సురక్షితంగా జరిగాయని పేర్కొన్న హోంశాఖ ఉన్నతాధికారిని పదవి నుంచి తొలగించారు. తన అధికారం అవసాన దశకు చేరుకుందనే సత్యం అతి కష్టం మీద బుర్రకెక్కుతుంటే చిత్తచాపల్యం పెరిగి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇరాన్‌ అణుస్థావరాలపై దాడికి తెగబడేందుకు మంతనాలు చేశారు. పెంటగాన్‌ రక్షణ ప్రధానకేంద్రంలో, నిఘా సంస్థలో ఉన్నత పదవుల్లో తన విశ్వాసపాత్రులను హఠాత్తుగా నియమించారు. సైనిక కుట్రకు పాల్పడతారేమో అనే అనుమానాలనూ రేకెత్తించారు.

అత్యధిక శాతం..

ట్రంప్‌ను గద్దె దించడానికి అమెరికా అన్ని శక్తులనూ కూడగట్టుకోవాల్సి వచ్చింది. అందుకే 120 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తూ అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది. దాదాపు 17 కోట్లమంది ఓట్లు వేశారు. ట్రంప్‌ దురభిమాన గణాన్ని అడ్డుకోవడానికి అందరికీ ఆ మాత్రం శ్రమ తప్పలేదు. మరో నాలుగేళ్లు ట్రంప్‌ ఉంటారేమో అనే ఊహకే చాలామంది వణికిపోయారు. తన 208 ఏళ్ల చరిత్రలో ‘న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ ఎప్పుడూ రాజకీయ అంశంపై సంపాదకీయం రాసిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి దేశ నాయకత్వం మారాలంటూ గత అక్టోబరులో ఆకాంక్షించింది. ప్రజారోగ్యంలో రాజకీయ జోక్యాన్ని బలంగా వ్యతిరేకించింది. ప్రఖ్యాత ‘నేచర్‌’ పత్రిక కూడా దాదాపు అలాంటి అభిప్రాయాలనే వెలిబుచ్చింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81మంది నోబెల్‌ పురస్కార గ్రహీతలు సంతకం చేసి విడుదల చేసిన ప్రకటనలోనూ ట్రంప్‌ను ఇంటికి సాగనంపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రత్యక్షంగా బైడెన్‌కు మద్దతు ఇచ్చారు. కరోనా కాలంలో పరిశోధనలను పక్కదోవ పట్టిస్తూ ట్రంప్‌ ఆడిన అబద్ధాలను అడ్డుకోవడానికి మరో ప్రసిద్ధ పత్రిక ‘సైన్స్‌’ కనీసం డజను సంపాదకీయాలు రాసింది. ప్రజల ప్రాణాలకు అధ్యక్షుడు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారో వివరించింది.

'అమెరికా ఫస్ట్‌, అన్ని ఉద్యోగాలూ అమెరికన్లకే' వంటి నినాదాలతో సామాన్య శ్వేతజాతి యువతను ఆకట్టుకున్న ట్రంప్‌ ఆఖరి వరకు ఆ ఆమోదాన్ని పొందగలిగారు. వ్యవస్థలను వ్యతిరేకించే విలక్షణ రాజకీయ లక్షణం కొందరిని మెప్పించింది. అందుకే ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. కానీ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరిగిపోవడం, కరోనా నియంత్రణలో వైఫల్యం, జాత్యహంకార ధోరణులతో ఓటమిపాలయ్యారు. ఇంతటితో ప్రమాదం తొలగి పోయిందనుకోడానికి వీల్లేదు. ట్రంప్‌ పదవి నుంచి వైదొలగినా.. సృష్టించిన జాతి, వర్గ వైషమ్యాల దుష్పరిణామాలను అమెరికా ఇంకా చాలాకాలం భరించాల్సి రావచ్చు!

- ఎమ్మెస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.