అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల సంవాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. డిబేట్లో మైక్ పెన్స్ అద్భుతంగా మాట్లాడారన్నారు. డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై అంత దూకుడు ప్రదర్శించలేదన్నారు.
కరోనా నుంచి కోలుకుంటున్న ట్రంప్.. శ్వేతసౌధంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌పై ట్వీట్ చేశారు.
-
Mike Pence is doing GREAT! She is a gaffe machine.
— Donald J. Trump (@realDonaldTrump) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mike Pence is doing GREAT! She is a gaffe machine.
— Donald J. Trump (@realDonaldTrump) October 8, 2020Mike Pence is doing GREAT! She is a gaffe machine.
— Donald J. Trump (@realDonaldTrump) October 8, 2020
"మైక్ పెన్స్ అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆమె (కమలా హారిస్) చెప్పేవన్నీ అసత్యాలే"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కాస్త శాంతంగా...
కొన్ని రోజుల క్రితం జరిగిన అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌తో పోలిస్తే ఉపాధ్యక్షుల సంవాదం కాస్త ప్రశాంతంగానే సాగింది.
- ఇదీ చూడండి: 'ఎలా ఉన్నావ్?' నుంచి 'నోరు మూస్తావా' వరకు...
ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో తనకు పెన్స్ శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని హారిస్ ప్రస్తావించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడిన సమయంలో ఆయన త్వరగా కోలుకోవాలని డెమోక్రటిక్ నేతలు కోరుకోవడాన్ని పెన్స్ స్వాగతించారు. డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల గెలవడంపై పెన్స్ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి: అమెరికా చరిత్రలోనే ఇది ఘోర వైఫల్యం: కమల