భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ఎగుమతికి భారత్ అనుమతించిన నేపథ్యంలో మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు ట్రంప్. ఆపద సమయంలో భారత్ చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.
కరోనాపై పోరాటంలో భారత ప్రజలకే కాకుండా మొత్తం మానవత్వానికే సహాయం చేశారని మోదీని కొనియాడారు ట్రంప్. ప్రధాని బలమైన నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.
"మా అభ్యర్థన మేరకు ఔషధాల ఎగుమతికి అనుమతి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి. ఈ సహాయాన్ని మేం గుర్తుంచుకుంటాం. అసాధారణ సమయంలో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. హెచ్‌సీక్యూపై నిర్ణయం తీసుకున్నందుకు భారత దేశానికి, ప్రజలకు ధన్యవాదాలు. దీన్ని ఎప్పటికీ మర్చిపోము."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మోదీ రిప్లై
అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ సాధ్యమైన సహాయం చేస్తుందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
-
Fully agree with you President @realDonaldTrump. Times like these bring friends closer. The India-US partnership is stronger than ever.
— Narendra Modi (@narendramodi) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
India shall do everything possible to help humanity's fight against COVID-19.
We shall win this together. https://t.co/0U2xsZNexE
">Fully agree with you President @realDonaldTrump. Times like these bring friends closer. The India-US partnership is stronger than ever.
— Narendra Modi (@narendramodi) April 9, 2020
India shall do everything possible to help humanity's fight against COVID-19.
We shall win this together. https://t.co/0U2xsZNexEFully agree with you President @realDonaldTrump. Times like these bring friends closer. The India-US partnership is stronger than ever.
— Narendra Modi (@narendramodi) April 9, 2020
India shall do everything possible to help humanity's fight against COVID-19.
We shall win this together. https://t.co/0U2xsZNexE
"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి సమయాలు స్నేహితులను మరింత దగ్గరకు చేర్చుతాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ సాధ్యమైన సహాయం చేస్తుంది. ఈ పోరాటాన్ని కలిసి గెలవాలి."
-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
బ్రెజిల్ అధ్యక్షుడు సైతం
బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో సైతం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఈ విషయం ప్రస్తావించారు.
"భారత ప్రధానితో నేరుగా మాట్లాడిన ఫలితంగా.. కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉత్పత్తి కోసం ముడి సరుకులు మనకు(బ్రెజిల్ కు) రానున్నాయి. ఇందుకు మోదీకి ధన్యవాదాలు"
-జైర్ బొల్సోనారో, బ్రెజిల్ అధ్యక్షుడు
డిమాండ్ ఉన్న డ్రగ్
ప్రపంచంపై విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఈ ఔషధానికి అన్ని దేశాల్లో డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం హెచ్‌సీక్యూ సరఫరాలో 70 శాతం భారత్ నుంచే ఉత్పత్తి అవుతోంది. దీంతో తొలుత ఈ డ్రగ్ ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం. దేశంలో తగిన నిల్వలు ఉన్న కారణంగా ఇటీవలే నిషేధాన్ని సడలించింది.