ETV Bharat / international

ట్రంప్​ 2.0: 'మిషన్​ 2024'కు సన్నద్ధం! - డొనాల్డ్​ ట్రంప్​

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం 'మిషన్​-2024' కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు ట్రంప్​. ఓవైపు ప్రస్తుత ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు తదుపరి ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నారు. 'ఇప్పుడు కుదరకపోతే నాలుగేళ్ల తర్వాత అయినా తిరిగొస్తా' అని రిపబ్లికన్లకు ధీమాగా చెబుతున్నారు. ఇంతకీ ట్రంప్​ ప్రణాళిక ఏంటి?

Trump teases 2024 run at White House Christmas party
'మిషన్​ 2024' కోసం ట్రంప్​ సన్నద్ధత
author img

By

Published : Dec 3, 2020, 5:27 PM IST

'ఈ నాలుగేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేళ్ల కోసం ప్రయత్నిస్తున్నా. అది కుదరకపోతే.. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కచ్చితంగా కలుస్తా....' అమెరికా శ్వేతసౌధంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రిపబ్లికన్లకు దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చెప్పిన మాటలివి. ఇవి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

వరుసగా మరో దఫా అధ్యక్షుడిగా ట్రంప్​ కొనసాగడం అసాధ్యం. ఆయన చేస్తున్న న్యాయపోరాటాలు విఫలమవ్వడమే ఇందుకు కారణం. దీంతో 'మిషన్​ 2024'పై ట్రంప్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనపడుతోంది. ఆయన ప్రవర్తన, మాటలు చూస్తే.. ఇందుకోసం ట్రంప్​ ఇప్పటికే రంగంలోకి దిగినట్టు అర్థమవుతోంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఏం చేస్తున్నారు?

ఓటమిని అంగీకరించకుండా..

నిజానికి.. ఈ 'మిషన్​ 2024' ప్రణాళిక నవంబర్​ 3నే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికలు​ ముగిసిన కొద్ది గంటలకే​ ట్రంప్​ ఓటమి ఖరారైపోయింది. కీలక స్వింగ్​ స్టేట్స్​లో పట్టుకోల్పోవడం వల్ల మరో రెండు రోజులకే ఆయన పరాజయం లాంఛనమైపోయింది. అయినా.. ఇప్పటికీ తన ఓటమిని అంగీకరించడం లేదు ట్రంప్​. ఓ వైపు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​.. పదవిని చేపట్టేందుకు సన్నహాలు చేస్తుంటే.. ట్రంప్​ మాత్రం న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అందులోనూ ఓడిపోతున్నారు. కానీ పట్టు మాత్రం వదలడం లేదు. న్యాయపోరాటంలో రిపబ్లికన్లను ముందుండి నడిపిస్తున్నారు.

ఇదీ చూడండి:- అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం.. కానీ!

భారీగా నిధులు..

అధ్యక్ష ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే మద్దతుదారులకు భారీగా మెయిల్స్​, టెక్స్ట్​ మెసేజ్​లు పంపించింది ట్రంప్​ బృందం. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. న్యాయపోరాటం కోసం నిధులు అందివ్వాలని అభ్యర్థించింది. ఫలితంగా నవంబర్ 3 నుంచి ఇప్పటివరకు ఏకంగా 170మిలియన్​ డాలర్లను పోగు చేసింది ఆ బృందం.

'సేవ్​ అమెరికా' క్యాంపైన్..​

ఎన్నికల్లో ఓటమి అనంతరం 'సేవ్​ అమెరికా' పేరుతో ఓ నేషనల్​ పొలిటికల్​ కమిటీని స్థాపించారు ట్రంప్​. ప్రతి మద్దతుదారుడి నుంచి సేకరించిన నిధుల్లో 75శాతం ఈ కమిటీకే వెళ్తోంది. అంటే.. 2024 ఎన్నికల ఖర్చు కోసం ఇప్పటి నుంచే నిధుల సేకరణ మొదలుపెట్టారాయాన. మిగిలింది ఆర్​ఎన్​సీ(రిపబ్లికన్​ నేషనల్​ కమిటీ)కి చేరుతోంది. ఇందులోంచి కొన్ని నిధులు న్యాయపోరాటానికి వెళుతున్నాయి.

ఇదీ చూడండి:- ట్విట్టర్​, ఫేస్​బుక్ ట్రంప్​ను బ్యాన్​ చేస్తాయా?

నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ట్రంప్​ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పోరాటం.. ఈ ఎన్నికల కోసమే కాదని.. భవిష్యత్తు ఎన్నికల కోసం కూడా అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్ల ఓటర్లు నమ్మకం కోల్పోయారని ఆరోపించారు. వారి విశ్వసాన్ని తిరిగి పొందేందుకే తాను పోరాడుతున్నట్టు పేర్కొన్నారు.

రిపబ్లికన్లు సిద్ధమేనా?

జీవిత కాలంలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం రెండుసార్లు ఉంటుంది. అంటే 8ఏళ్లు. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్​కు మరో దఫా మిగిలే ఉంది. అందుకే 2024పై గురిపెట్టారు ట్రంప్​.

మరోవైపు రిపబ్లికన్​ పార్టీలో ట్రంప్​ ఎదురులేని శక్తిగా ఎదిగారు. అందుకే.. ఈ నాలుగేళ్లల్లో ట్రంప్​పై ప్రపంచమంతటా ఎన్ని విమర్శలు, అరోపణలు వచ్చినా.. రిపబ్లికన్లు మాత్రం ఆయన వెంటే నిలబడ్డారు. సమస్యల నుంచి అయన్ను అనేకమార్లు గట్టెక్కించారు.

అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ ఓడిపోయినా.. రిపబ్లికన్లు మాత్రం గెలిచారు. దీంతో 'ఓడింది ట్రంపే కానీ ట్రంపిజం కాద'ని రుజువైంది. అందువల్ల నాలుగేళ్ల తర్వాత ట్రంప్​నే తమ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా రిపబ్లికన్లు ఎన్నుకునే అవకాశాలు ఎక్కువ!

ఇదీ చూడండి:- వ్యవస్థలపై ట్రంప్ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.