అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారీ ర్యాలీ తీయడానికి ట్రంప్ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా జనవరి 6న నిరసన కార్యక్రమం జరుగనున్నట్లు ట్రంప్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ జనవరి 6న, ఉదయం 11 గంటలకు వాషింగ్టన్ డీసీలో భారీ ర్యాలీ జరుగనుంది. పెద్ద మొత్తంలో సాక్ష్యాలను సమర్పిస్తాము. మేము గెలుస్తాం.
-ట్విట్టర్లో డొనాల్డ్ ట్రంప్.
2020 ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఐక్యతను చాటడానికి అమెరికన్లు నిరసనలో పాల్గొనాలని ర్యాలీకి నాయకత్వం వహిస్తున్న విమెన్ ఫర్ అమెరికా ఫస్ట్ అనే సంస్థ పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి:'2021..డీఆర్డీవోకు ఎగుమతుల సంవత్సరం'