ETV Bharat / international

మీడియా కవరేజీపై ట్రంప్, ఒబామా మాటల యుద్ధం - trump slams biden over graft cases

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్​ ట్రంప్​ మీడియాపై ధ్వజమెత్తారు. డెమొక్రాట్​ అభ్యర్థి జోబైడెన్​ అవినీతి కేసులను మీడియా కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. అటు... మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ట్రంప్ తీరును తప్పుబట్టారు. శ్వేతసౌధాన్ని 'కరోనా హాట్​ జోన్​'గా మార్చారని విమర్శించారు.

Trump slams media for 'blocking' alleged graft cases against Biden
మీడియా కవరేజీపై ట్రంప్, ఒబామా మాటల యుద్ధం
author img

By

Published : Oct 28, 2020, 11:14 AM IST

అమెరికాలోని మీడియా సంస్థలు, బడా టెక్​ కంపెనీలు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుతున్నాయని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. ప్రస్తుతం మీడియా వ్యవహరిస్తున్న తీరు పత్రికా స్వేచ్ఛ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తారు.

"ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు. మీడియా చరిత్రలో ఇదొక దురదృష్టకర సమయం. టెక్​ సంస్థలు సైతం బైడెన్​కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. బైడెన్​ది పూర్తిగా అవినీతిమయ జీవితం అని అందరికీ తెలుసు. కానీ మీరు దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల బైడెన్​ మీ కంపెనీలకు వెన్నుదన్నుగా ఉంటారని మీరు భావిస్తున్నారు. "

-- డొనాల్డ్​ ట్రంప్ ,అమెరికా అధ్యక్షుడు.

'బైడెన్​కు మద్దతుగా మీడియా'

విస్కాన్సిన్​ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్​ ట్రంప్​ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ సైతం మీడియా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం దేశంలోని మీడియా, టెక్ కంపెనీలు బైడెన్​కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బైడెన్​కు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ప్రచురించటం లేదని మండిపడ్డారు.

'హాట్​జోన్​లా శ్వేతసౌధం'

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని కొవిడ్-19 పరిస్థితిని ప్రపంచానికి తెలియచెబుతూ ఉండడం వల్ల మీడియోపై ట్రంప్​ కోపంగా ఉన్నారని తెలిపారు.

"ప్రాథమిక దశలోనే కొవిడ్-19పై దృష్టి సారిస్తే అమెరికాలో ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదు. శ్వేతసౌధాన్ని ట్రంప్​ 'కరోనా హాట్​ జోన్​'గా మార్చారు. కొవిడ్​ను ట్రంప్​ తేలిగ్గా తీసుకున్నారు. బైడెన్​ అయితే ఇలా వ్యవహరించేవారు కాదు "

---బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు.

ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.