ETV Bharat / international

'టిక్​టాక్'​పై నిషేధానికి ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం - tiktok ban in us

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ యాప్స్ టిక్​టాక్, వుయ్​చాట్​పై నిషేధం విధించే కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశం అత్యంత చెత్త ఒప్పందంగా అభివర్ణించారు ట్రంప్.

US TIKTOK
డొనాల్డ్ ట్రంప్
author img

By

Published : Aug 7, 2020, 8:38 AM IST

ప్రముఖ చైనా యాప్ 'టిక్​టాక్'​పై నిషేధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఈ జాబితాలో మరో దిగ్గజ యాప్ 'వుయ్​చాట్' కూడా ఉంది.

ఈ యాప్​లపై నిషేధం మరో 45 రోజుల్లో అమల్లోకి వస్తుంది. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థకు నష్టం అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు.

"టిక్​టాక్​.. చైనీస్ కంపెనీ బైట్​డాన్స్​కు చెందినది. ఇది వినియోగదారుల డేటాను చాలా పెద్దమొత్తంలో సేకరిస్తోంది. దీని ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ అమెరికన్ల వ్యక్తిగత, వ్యాపార సంబంధమైన సమాచారాన్ని పొందుతోంది. ఫెడరల్ ఉద్యోగులు, గుత్తేదారుల లొకేషన్లను గుర్తించి బ్లాక్​మెయిల్​కు పాల్పడుతోంది."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

చైనాపై తీవ్ర విమర్శలు..

చైనాపైనా ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో చైనా ప్రవేశం అత్యంత చెత్త ఒప్పందమని వ్యాఖ్యానించారు. "మీరు నిజం తెలుసుకోవాలంటే.. వాళ్లు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. ఇంతవరకు అలా ఎవరు చేయలేదు." అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జైశంకర్, పాంపియో మధ్య టెలిఫోన్ సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.