ETV Bharat / international

'టీకా ప్రాధాన్యత' ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లపై ట్రంప్​ సంతకం

తమ దేశ ప్రజలకే తొలి ప్రాధాన్యతనిస్తూ.. వ్యాక్సిన్​ సరఫరా ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్స్​పై అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్​ సంతకం చేశారు. అమెరికన్లకు టీకా అందించే క్రమంలో అవసరమైతే.. డిఫెన్స్​ ప్రొడక్షన్​ చట్టాన్ని కూడా అమలు చేస్తానని చెప్పారు.

Trump signs executive order prioritising COVID-19 vaccine for Americans
కరోనా వ్యాక్సిన్​ ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్స్​పై ట్రంప్​ సంతకం
author img

By

Published : Dec 9, 2020, 12:10 PM IST

Updated : Dec 9, 2020, 1:19 PM IST

కరోనా వ్యాక్సిన్​ తొలుత అమెరికన్లకు లభించే విధంగా ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లపై సంతకం చేశారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇతర దేశాలకు టీకాలు అందించే ముందు తమ దేశానికే ప్రాధాన్యతనిచ్చేందుకు ఈ చర్యలు చేపట్టారు.

అగ్రరాజ్య ప్రజలకే తొలుత వ్యాక్సిన్ అందించే విషయంలో.. అవసరమైతే డిఫెన్స్​ ప్రొడక్షన్​ యాక్ట్​(డీపీఏ)నూ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు ట్రంప్​. ప్రభుత్వ ఆర్డర్లకే తొలి ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రైవేటు సంస్థలపై డీపీఏ ఒత్తిడి పెంచుతుంది.

సురక్షితమైన, సమర్థవంతమైన తొలి కరోనా వ్యాక్సిన్​ను అగ్రరాజ్య కంపెనీలే రూపొందించాయని హర్షం వ్యక్తం చేశారు ట్రంప్​. కరోనాపై త్వరలోనే విజయం సాధిస్తామని.. శ్వేతసౌధంలో జరిగిన 'ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్​' కార్యక్రమం సందర్భంగా వ్యాఖ్యానించారు.

"మేము త్వరలోనే కరోనా మహమ్మారిని అంతం చేస్తాం. దీంతో అమెరికా సహా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను రక్షిస్తాం. అందుకోసం మా పాలనా యంత్రాంగంలోనే.. మొదటగా సురక్షితమైన, సమర్థవంతరమైన వ్యాక్సిన్​ ఉత్పత్తిని చేశాం."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అమెరికా.. ఫైజర్​, మోడెర్నా వ్యాక్సిన్​లను అభివృద్ధి చేస్తోంది. అయితే టీకా ఉత్పత్తి, సరఫరా కోసం ఆ దేశం ఇప్పటివరకు 14బిలియన్​ డాలర్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. ఈ టీకాలు 95శాతం సమర్థతను చాటుకున్నాయని ట్రంప్​ పేర్కొన్నారు.

'నేనే అధ్యక్షుడిని..'

అగ్రరాజ్య అధ్యక్షుడిగా మరోమారు తానే కొనసాగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు ట్రంప్​. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అధికారికంగా ధ్రువీకరించనున్న తరుణంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

నవంబర్​ 3న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​పై.. డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​ విజయం సాధించారు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించని ట్రంప్​.. ఎన్నికల్లో మోసం జరిగిందంటూ న్యాయపోరాటానికి దిగారు. పలు కోర్టుల్లో వ్యాజ్యం వేయగా.. ఆయా న్యాయస్థానాలు ఆయన పిటిషన్​లను తిరస్కరించాయి.

ఇదీ చదవండి: అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లను భారీగా పెంచిన భారత్​

Last Updated : Dec 9, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.