ETV Bharat / international

అమెరికాకు చైనా విద్యార్థుల రాకపై నిషేధం - అమెరికా చైనా వివాదం

చైనాపై కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో మండిపడుతోన్న అమెరికా... ఇప్పుడు ఆంక్షల ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన విద్యార్థులు, పరిశోధకులకు అమెరికాలో ప్రవేశాన్ని నిషేధించింది ట్రంప్ ప్రభుత్వం. అంతేకాకుండా చైనాకు వత్తాసు పలికిందని ఆరోపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు ట్రంప్.

Trump
అమెరికా
author img

By

Published : May 30, 2020, 12:56 PM IST

చైనాపై ఆంక్షల అస్త్రం ప్రయోగించింది అమెరికా. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలు ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు అమెరికాలో ప్రవేశాన్ని నిలిపేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వీరి ద్వారా అమెరికా మేధో సంపత్తిని దొంగలిస్తున్నారని ఆరోపించారు.

చైనా వ్యవహార శైలిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు ట్రంప్. కరోనాకు సంబంధించి చైనా పారదర్శకంగా వ్యవహరించేంత వరకు కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.

"పీజీ, డాక్టరేట్ విద్యార్థులతో సంప్రదాయేతర పద్ధతుల్లో మేధో సంపత్తిని చైనా దొంగలిస్తోంది. అందువల్ల ఇక్కడికి వచ్చే పీజీ విద్యార్థులు, పరిశోధకులకు పీఎల్​ఏతో సంబంధాలు ఉన్నాయి. దీని వెనుక చైనా అధికారుల కుట్ర ఉంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన కొంతమంది పౌరులు ఎఫ్​, జే (విద్య, పరిశోధన) వీసాలపై వచ్చేవారికి ప్రవేశం నిషేధిస్తున్నాం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఎఫ్​-1 వీసాలతో ఫుల్​ టైమ్ డిగ్రీ, ఇతర కోర్సులు.. జే-1 వీసాలతో సాంస్కృతిక, ఇతర విషయాలపై పరిశోధనకు అనుమతిస్తారు. ఎఫ్​-1 వీసాలు కోర్సు పూర్తయ్యే వరకు వర్తిస్తుంది. జే-1 వీసాలు ఆన్​ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్​ (కొన్ని సందర్భాల్లో) పని చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

వాణిజ్యపరంగా..

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ వెల్లడించారు. ఈ మేరకు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే చైనా పౌరులను ఇకపై అమెరికాలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. అమెరికాలో చైనా పెట్టుబడుల విషయంలోనూ నిబంధనల్ని కఠినతరం చేస్తామని ప్రకటించారు.

"గత కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోంది. మేధో హక్కులతో పాటు బిలియన్ల డాలర్లు విలువైన పెట్టుబడుల్ని అక్రమ మార్గాన మళ్లించుకుంటోంది. అలాగే ఉద్యోగాల్లోనూ అమెరికా నిబంధనల్ని అతిక్రమించింది. వాణిజ్యం విషయంలోనూ ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిబంధనల్ని పాటించలేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగిస్తోంది. చైనాతో అమెరికా ఎప్పటికీ నిర్మాణాత్మక బంధాన్నే కోరుకుంటోంది. కానీ, అందుకోసం దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడలేం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

హాంకాంగ్ విషయంలో..

హాంకాంగ్‌ స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంటు ‘నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌’ గురువారం ఆమోదించడంపైనా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984లో బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తోందని చెప్పారు. హాంకాంగ్​కు ఇచ్చిన ప్రత్యేక హోదాకు స్వస్తి పలకనున్నామని తెలిపారు ట్రంప్.

డబ్ల్యూహెచ్​ఓ పైనా..

ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా పూర్తిగా తన నియంత్రణలో పెట్టుకుందని ట్రంప్ ఆరోపించారు. చైనా ఒత్తిడి వల్ల ప్రపంచాన్ని డబ్ల్యూహెచ్​ఓ తీవ్ర ప్రమాదంలోకి నెట్టిందని.. ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు, కోట్ల సంపద హరించుకుపోయిందని దుయ్యబట్టారు. డబ్ల్యూహెచ్​ఓతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ సంస్థకు అందించే నిధులను ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు మళ్లించనున్నట్లు వెల్లడించారు.

"చైనా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కరోనా విషయంలో పారదర్శకంగా విచారణ జరగాలి. వుహాన్​ నుంచి ప్రపంచమంతా చేరిన వైరస్​.. చైనాలోని ఇతర ప్రాంతాలకు ఎందుకు వ్యాపించలేదు? బీజింగ్​కు ఎందుకు వెళ్లలేదు? సొంత దేశంలో ప్రయాణాలపై ఆంక్షలు విధించి.. ప్రపంచానికి దారులు మాయలేదు. ఫలితంగా ప్రపంచ దేశాల్లో విధ్వంసం కొనసాగుతోంది."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

విద్యార్థులకు సంబంధించి ట్రంప్ ప్రకటనపై చైనా మండిపడింది. ఇది పూర్తిగా జాత్యహంకార చర్యగా అభివర్ణించింది. మెక్​కార్థీ శకానికి చెందిన రాజకీయ విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించింది.

ఇదీ చూడండి: 'ట్రంప్ బెదిరింపులు.. రాజకీయ హింసకు ప్రతీక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.