ETV Bharat / international

'కరోనాను 'చైనీస్​ వైరస్​' అనటంలో తప్పేలేదు' - us china coronavirus

కరోనా వైరస్​ను చైనాకు ఆపాదించటాన్ని సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. కొవిడ్​-19 అక్కడనుంచే వ్యాపించినందున 'చైనీస్​ వైరస్' వ్యాఖ్య సరైనదేనని చెప్పుకొచ్చారు.

trump
ట్రంప్
author img

By

Published : Mar 18, 2020, 5:32 AM IST

Updated : Mar 18, 2020, 7:14 AM IST

డొనాల్డ్ ట్రంప్

కొవిడ్​-19ను 'చైనీస్​ వైరస్​'గా వ్యవహరించటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. వైరస్​కు సంబంధించి అమెరికా, చైనా మధ్య వాగ్వాదం నడుస్తున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వైరస్​కు సంబంధించి అమెరికాపై చైనా చేస్తోన్న విమర్శల నేపథ్యంలో స్పందించారు ట్రంప్​. వుహాన్​లో అమెరికా సైన్యం సందర్శనతోనే వైరస్​ వ్యాపించిందన్న ఆరోపణలనూ తోసిపుచ్చారు.

"కరోనా వైరస్​ ​ చైనా నుంచే వచ్చింది. అందువల్ల చైనీస్​ వైరస్​ అనే పదం సరిగ్గా సరిపోతుంది. వైరస్​కు మొదలైన క్రమానికి సంబంధించి చైనా చేస్తోన్న ఆరోపణలు అవాస్తవం. మా సైన్యం వారికి వైరస్​ వ్యాప్తి చేశాయన్న ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. అలా మా సైన్యం చేయలేదు."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అమెరికా వర్సెస్ చైనా..

వైరస్​ వ్యాప్తికి మీరంటే మీరే కారణమంటూ అమెరికా, చైనా ఘర్షణ పడుతున్నాయి. కరోనా నుంచి గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా 'చైనీస్​ కరోనా వైరస్​' అంటోంది అమెరికా యంత్రాంగం. 'చైనీస్ వైరస్' అంటూ మరో అడుగు ముందుకేశారు ట్రంప్. చైనాను ఉద్దేశించి సార్స్, కోవిడ్-19 లను 'వుహాన్ వైరస్​'గా పదేపదే ప్రస్తావించారు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో.

ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం వుహాన్​కు వైరస్ తీసుకొచ్చిందని గతవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఆరోపించారు. ఈ మేరకు చైనాలోని పలు ఛానళ్లు ప్రసారం చేశాయి.

ఈ రెండు దేశాల పరస్పర ఆరోపణలతో ఆసియా-అమెరికా సమాజాల మధ్య జాత్యాంహకార ధోరణికి దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'

Last Updated : Mar 18, 2020, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.