కొన్ని రోజులుగా దోషులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ.. అందరినీ ఆశ్యర్చపరుస్తోన్న ట్రంప్ తాజా గా మరో పని చేశారు. ప్రెసిడెన్షియల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డుతో అమెరికా ఇంటలిజెన్స్ కమిటీ మాజీ అధ్యక్షుడు డెవిన్ న్యూన్స్‌ని సత్కరించారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి రష్యా సహకరించిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనకు మద్ధతుగా న్యూన్స్ నిలిచారు. అంతేకాకుండా 2019 ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడూ ట్రంప్‌వైపే నిలబడ్డారు.
కాగా ట్రంప్ సహచరులు, మద్ధతుదారుల్లో చాలా మంది, అధ్యక్ష ఎన్నికల్లో ప్రమేయం విషమయై దోషులుగా తేలారు. అందులో జాతీయ భద్రతా మాజీ సలహాదారు మైకెల్ ఫ్లిన్ ఉన్నారు. ఎఫ్‌బీఐ దర్యాప్తులో వారంతా అబద్ధం చెప్పారనే కారణంతో దోషులుగా తేలారు. అయితే ఫ్లిన్కు గతనెలలో క్షమాభిక్ష ప్రసాదించారు.
ఇదీ చూడండి: 'ట్రంప్ హయాంలో భారత్‌తో వాణిజ్య విభేదాలు