ETV Bharat / international

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం - వాణిజ్య యుద్ధం

రెండు అగ్రరాజ్యాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై సుంకాన్ని పెంచేందుకు ట్రంప్ సర్కార్​ సిద్ధమైంది.

చైనా-అమెరికా
author img

By

Published : May 11, 2019, 11:19 AM IST

Updated : May 11, 2019, 12:58 PM IST

అగ్రరాజ్యాల మధ్య తీవ్రమవుతున్న వాణిజ్య యుద్దం

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్​ డీసీలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. అదే సమయంలో మరింత దూకుడు పెంచింది ట్రంప్ సర్కార్​. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై సుంకాన్ని పెంచేందుకు సిద్ధమైంది.

"అమెరికా-చైనా ప్రతినిధుల భేటీకి ముందు 200 బిలియన్ డాలర్లు విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాన్ని 10 నుంచి 25 శాతానికి పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి లియూ హీతో రెండు రోజుల చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరనందున మరో 300 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని అధ్యక్షుడు నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సుంకం పెంపుపై తుది నిర్ణయాన్ని త్వరలోనే ఫెడరల్​ రిజిస్టర్​లో నమోదు చేస్తాం."

-రాబర్ట్ లైతీజర్​, అమెరికా వాణిజ్య ప్రతినిధి

ట్రంప్​ ఆగ్రహం

ఇరు దేశాల వాణిజ్య చర్చల విఫలంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో చైనా తీరుపై మండిపడ్డారు.

ట్రంప్ ట్వీట్
ట్రంప్ ట్వీట్
ట్రంప్ ట్వీట్
ట్రంప్ ట్వీట్

"ఇరు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంగా లేదు. చైనాకు మేం కేవలం 100 బిలియన్​ డాలర్ల ఎగుమతులు చేస్తున్నాం. ఏటా 500 బిలియన్ డాలర్లు కోల్పోతున్నాం. ఇలా చాలా ఏళ్లుగా జరుగుతోంది. చైనాతో ఈ వింత వాణిజ్యానికి ఇక చెల్లు.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో నా అనుబంధం దృఢమైనదే. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరుగుతాయి."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఆశలు సజీవం

వాణిజ్య వివాదం పరిష్కారానికి మరోమారు సమావేశం కావాలని నిర్ణయించినట్లు చైనా వాణిజ్యశాఖ ప్రతినిధి, ఉప ప్రధాని లియూ హీ వెల్లడించారు.

"అనేక అంశాలపై ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. నిజం చెప్పాలంటే విభేదాలు మాత్రం అలాగే ఉన్నాయి. మా ప్రాథమిక సూత్రాల విషయానికి వస్తే ఇవన్నీ క్లిష్టమైన అంశాలే. ప్రతి దేశానికి కొన్ని విధానాలు ఉంటాయి. మేం అందులో స్పష్టంగా ఉంటాం. సహకారమే ఈ సమస్యకు పరిష్కారం. భవిష్యత్తులో రెండు దేశాలు తప్పకుండా పరస్పరం సహకరించుకుంటాయని నా గట్టి నమ్మకం. అమెరికా, చైనా ఆకాంక్షలకు అనుగుణంగా క్రమపద్ధతిలో ఈ సమస్యను పరిష్కరిస్తాం. చైనా గానీ, చైనీయులు గానీ భయపడట్లేదు. "

-లియూ హీ, చైనా ఉప ప్రధాని

ఇదీ చూడండి: 'పన్నులు పెంచినా.. చర్చలు కొనసాగుతాయి'

Bokaro (Jharkhand), May 11 (ANI): Jharkhand Chief Minister Raghubar Das on Friday drew a parallel between armed forces and voters, and said as the soldiers are using bombs and bullets to punish Pakistan's nefarious acts, the voters, too, should use "ballot bomb" to defeat the Congress, whom he accused of being the chief of Pakistani terrorists.
Last Updated : May 11, 2019, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.