ETV Bharat / international

'అభిశంసన'లో ట్విస్ట్- ట్రంప్​కు సొంత​ లాయర్​ షాక్​! - ట్రంప్​ న్యాయవాది

సాధారణంగా తమ వాదన వినిపించడానికి ఎవరైనా న్యాయవాదిని పెట్టుకుంటారు. కానీ అదే లాయర్ మనకు వ్యతిరేకంగా వాదిస్తే? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విషయంలో ఇదే జరుగుతోంది.సెనేట్​లో జరుగుతోన్న అభిశంసన విచారణలో తన న్యాయవాది వాదన విని ట్రంప్​ సైతం షాకయ్యారు.

Trump
అభిశంసన విచారణలో ట్విస్ట్- ట్రంప్​కు​ లాయర్​ షాక్​!
author img

By

Published : Feb 10, 2021, 12:55 PM IST

డొనాల్డ్​ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన నేత. అయినా ఇప్పటికీ ట్రంప్​ పేరు రోజూ వార్తల్లో వస్తూనే ఉంటుంది. తాజాగా ట్రంప్ అభిశంసనపై సెనేట్​ విచారణ ప్రారంభించింది. అయితే ఈ విచారణలో ట్రంప్​ తరఫు న్యాయవాదుల వాదన మాజీ అధ్యక్షుడికి షాక్​ ఇచ్చింది. ఇప్పటివరకు అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లు ట్రంప్​ ఒప్పుకున్న సందర్భమే లేదు. అయితే ట్రంప్​ లాయర్లు మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ ఘోరంగా ఓడిపోయారని.. బైడెన్​ను ప్రజలు ఎన్నుకున్నారని వాదిస్తున్నారు.

"అమెరికా ప్రజలు తమ గళం వినిపించారు. అధికార యంత్రాంగాన్ని మార్చారు. పాత ప్రభుత్వం నచ్చకపోతే కొత్త సర్కార్​ను ఎన్నుకోవచ్చు. వారు అదే చేశారు. ఇప్పుడు ట్రంప్​ను అభిశంసించడం కుదరదు. ఎందుకంటే అధికారంలో లేని వ్యక్తిని మీరు ఎలా అభిశంసిస్తారు. పదవి నుంచి తప్పించడమే అభిశంసన ప్రక్రియలో అతి పెద్ద శిక్ష అని రాజ్యాంగం చెబుతోంది. మరి అసలు పదవిలో లేని వ్యక్తిని మీరు ఎలా శిక్షిస్తారు? ఆ పని ఓటర్లు ఇప్పటికే చేశారు."

- బ్రూస్​ కాస్టర్​, ట్రంప్​ తరఫు న్యాయవాది

సెనేట్​లో జరిగిన ఈ విచారణను ఫ్లోరిడా క్లబ్​లో ట్రంప్​ వీక్షించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన తరఫున వాదిస్తోన్న న్యాయవాది మాటలు విని ట్రంప్​ ఆగ్రహంతో ఊగిపోయినట్లు సమాచారం. క్యాపిటల్​ ఘటనలో ట్రంప్ తన మద్దతుదారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు, దాడి చిత్రాలను సభలో డెమొక్రాట్లు ప్రసారం చేశారు. వీటిని చూసిన ట్రంప్.. వారితో పోలిస్తే తన లాయర్ల వాదనలో ఎంతమాత్రం పస లేదని చెప్పినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

న్యాయవాది బ్రూస్​ కాస్టర్​ వాదనలను మరో ట్రంప్​ లాయర్​ డెర్స్​షో ఖండించారు.

"అసలు వాదనే లేదు. అసలు ఆయన (కాస్టర్​) ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు సంబంధం లేని విషయాలు ఎందుకు చెబుతున్నారో తెలియడం లేదు."

- డెర్స్​షో, మరొక ట్రంప్​ లాయర్​

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే వాదనను విచారణలో బలంగా వినిపించాలని తన లాయర్లకు ట్రంప్​ తెలిపారు. అయితే ఇందుకు వారు అంగీకరించడం లేదు.

ఇదీ చూడండి: ట్రంప్ అభిశంసన: సెనేట్​లో ఆరుగురు రిపబ్లికన్ల మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.