ETV Bharat / international

ట్రంప్ ప్రచార సభ వాయిదా.. ఆఫ్రో అమెరికన్ల డిమాండ్లే కారణం - భారతీయ అమెరికన్లతో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార సభను ఒకరోజు పాటు వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన జూన్ 19న బానిసత్వ ముగింపు దినోత్సవం అయిన నేపథ్యంలో ఆయా వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు జూన్ 20కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

trump
ట్రంప్ ప్రచార సభ వాయిదా.. ఆఫ్రో అమెరికన్ల డిమాండ్లే కారణం
author img

By

Published : Jun 16, 2020, 5:19 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఎన్నికల ప్రచార సభను ఒక రోజు పాటు వాయిదా వేశారు. జూన్ 19న జూనెటీన్త్​ జరుపుకోనున్న నేపథ్యంలో తన సన్నిహితుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా నల్లజాతీయులకు బానిసత్వం ముగిసిన రోజునే ప్రచార సభ నిర్వహించడంపై ట్రంప్​పై విమర్శలు వచ్చాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి ముందు తన మొదటి ఎన్నికల ప్రచార ర్యాలీకి ఎంచుకున్న తేదీ, ప్రదేశం ప్రాముఖ్యత ట్రంప్​కు తెలియదని అమెరికా చట్టసభలోని ఆయన మద్దతుదారులు బాసటగా నిలిచారు.

ట్రంప్ ర్యాలీ నిర్వహించాలనుకున్న జూన్ 19నే అమెరికాలో బానిసత్వం ముగిసింది. ఆ రోజును జూనెటీన్త్ అని పిలుస్తారు. ర్యాలీకి ఎంచుకున్న టల్సా, ఓక్లహోమా ప్రాంతం 1921లో నలుపు-తెలుపు వర్గీయుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో ఒకటిగా చరిత్రకెక్కింది.

జూన్ 19 ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రచార ర్యాలీని వాయిదా వేయాల్సిందిగా ఆఫ్రో అమెరికన్ రాజకీయ నేతలు ట్రంప్​ను కోరారు. ఈ నేపథ్యంలో జూన్ 20కి ప్రచార సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.

ఇదీ చూడండి: ప్లాస్టిక్, వ్యవసాయ వ్యర్థాలతో బయో ఇంధనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.