అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బైడెన్ ప్రసంగించే సమయంలో మాస్కు ధరించే విధానాన్ని ఎగతాళి చేశారు.
"మీరు ఎప్పుడైనా మాస్కును తనకన్నా అమితంగా ఇష్టపడే వ్యక్తిని చూశారా? బైడెన్ దానిని తన భద్రతగా భావిస్తారు. మాట్లాడేటప్పుడు చెవికి తగిలిస్తారు. నేను మానసిక వైద్య నిపుణుడిని అయ్యుంటే.. ఆయనకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పగలను" అంటూ పెన్సిల్వేనియా సభలో బైడెన్‌ను ఎద్దేవా చేశారు.
అయితే, కార్మిక దినోత్సవ వారాంతంలో అందరూ విధిగా మాస్కులు ధరించాలని ట్రంప్ సూచించారు. గతంలో మాదిరిగా భారీగా కేసులు నమోదు కాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. భౌతిక దూరం పాటించాలని, ఎవరికైనా దగ్గరగా ఉన్నప్పుడు మాస్కు తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్ రెండోసారి సోకుతుందా?