ETV Bharat / international

దిల్లీ కాకుంటే జైపుర్​లో​ ట్రంప్ విమానం​ ల్యాండింగ్​!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ త్వరలో భారత్​లో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే దిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకుంటే ఆయన విమానం రాజస్థాన్​లోని జైపుర్​లో దిగొచ్చని అధికారులు తెలిపారు.

author img

By

Published : Feb 19, 2020, 8:53 PM IST

Updated : Mar 1, 2020, 9:26 PM IST

Trump may land in Jaipur if Delhi weather is poor
జైపూర్ విమానాశ్రయానికి ట్రంప్​​: వాతావరణ పరిస్థితులే కారణమా..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సతీసమేతంగా ఈనెల 24,25 తేదీల్లో భారత్​లో పర్యటిస్తారు. అందుకు సంబంధించి షెడ్యూల్​ మొత్తం ఇప్పటికే సిద్ధమైంది. ట్రంప్​ ఓ ప్రత్యేక విమానంలో దిల్లీ విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో ఇప్పటకే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాజాగా దిల్లీ వాతావరణంలో మార్పులు రావడం వల్ల ల్యాండింగ్​ ప్రదేశాన్ని మార్చినట్లు సమాచారం. ఒకవేళ దిల్లీలో కాకుంటే రాజస్థాన్​లోని జైపుర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్​ అవుతుందని తెలిపారు అధికారులు. ఈ మేరకు జైపుర్ విమానాశ్రయంలోనూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికా నుంచి వచ్చిన ముగ్గురు ప్రత్యేక సిబ్బంది బృందం ఆ ​విమానాశ్రయాన్ని సందర్శించి వసతులను పరిశీలించింది.

"విమానాశ్రయంలో వీవీఐపీల ప్రత్యేక విమానాల రాకపోకలకు అన్ని వసతులు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖుల విమానాలు ల్యాండింగ్​కు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం."

- జైదీప్​ సింగ్​ బల్హారా, ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా డైరెక్టర్

ఇదీ చదవండి: అహ్మదాబాద్​కు 'అధ్యక్షుడి' రక్షణ బృందం

Last Updated : Mar 1, 2020, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.