అమెరికా అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో తన చివరి గంటలను గడుపుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే జో బైడెన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఇలా తదుపరి అధ్యక్షుడి ప్రమాణస్వీకార వేడుకకు హాజరుకాని అధ్యక్షుల జాబితాలో చేరారు ట్రంప్. మరి ఆ జాబితాను ఎవరెవరు ఉన్నారు?
గతంలో..
- 1801లో.. అగ్రరాజ్య 3వ అధ్యక్షుడిగా థామస్ జెఫర్సన్ ప్రమాణస్వీకార వేడుకకు నాటి అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ హాజరుకాలేదు. వేడుకకు కొద్ది గంటల ముందే గుర్రపు బండిలో వాషింగ్టన్‌ను వీడారు.
- 1829లో అడ్రూ జాక్సన్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని అధ్యక్షుడు జాన్ క్విన్సి ఆడమ్స్ బహిష్కరించారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా విద్వేషాల మధ్య ఎన్నికలు జరిగాయి. పదవీ బాధ్యతలు చేపట్టే కొన్ని రోజుల ముందు జాక్సన్ భార్య మృతిచెందారు. తన భార్య మరణానికి.. ఆడమ్స్ నేరపూరిత కార్యకలాపాలే కారణమని ఆరోపించారు జాక్సన్.
- 1869లో.. యులెస్సిస్ ఎస్. గ్రాంట్ ప్రమాణస్వీకార వేడుకకు అధ్యక్షుడు జాన్సన్ వెళ్లలేదు. శ్వేతసౌధంలోనే ఉండిపోయారు.
- గెరాల్డ్ ఫోర్డ్ పదవీ బాధ్యతలు చేపట్టే కొద్దిగంటల ముందు రిచర్డ్ నిక్సన్ శ్వేతసౌధం నుంచి హెలికాఫ్టర్‌లో వెళ్లిపోయారు. అయితే వాస్తవానికి అప్పుడు ఎలాంటి వేడుకలు జరగలేదు. 'వాటర్‌గేట్' స్కామ్ బయటపడటం వల్ల నిక్సన్ తన రాజీనామాను అందించారు. అనంతరం శ్వేతసౌధంలో గెరాల్డ్ ప్రమాణస్వీకారం చేశారు.
ఇలా అతి కొద్దిమంది ఉన్న జాబితాలో ట్రంప్ కూడా చేరారు. అయితే యూఎస్ క్యాపిటల్‌పై దాడికి ప్రేరేపించారన్న ఆరోపణలు సహా తన పదవీకాలంలో రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు.
ఇవీ చూడండి:-