ETV Bharat / international

'ట్రంప్​ మళ్లీ అధికారం కోరుకునేది అందుకే!'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు స్వలాభం తప్ప ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టదని ధ్వజమెత్తారు ఒబామా. బైడెన్​కు మద్దతుగా ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రిపబ్లికన్​ అభ్యర్థిపై ఈమేరకు తీవ్ర విమర్శలు చేశారు.

Obama vs donald trump
ట్రంప్​ రెండోసారి అధికారం కోరుకునేది అందుకోసమే....
author img

By

Published : Oct 25, 2020, 3:56 PM IST

స్వలాభం, ధనవంతులైన స్నేహితులకు సాయం చేసేందుకే మరోమారు అమెరికా అధ్యక్షుడు కావాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని ఆరోపించారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. సాధారణ పౌరుల గురించి ట్రంప్​కు పెద్దగా పట్టింపులేదని విమర్శించారు. బైడెన్​, హ్యారిస్​ మాత్రం అందరికోసం పోరాడుతున్నారని కితాబిచ్చారు.

డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​కు మద్దతుగా ఫ్లోరిడాలో ప్రచారం నిర్వహించారు ఒబామా.

"వాళ్ల(బైడెన్​, హ్యారిస్​) చుట్టూ లాబీ చేసేవాళ్లు, ప్రముఖులు లేరు. మీ మంచి కోరే వ్యక్తులే వారి చుట్టూ ఉంటారు. ఇదే వారి ప్రత్యర్థులకు, వారికి ఉన్న తేడా. వాళ్లు నిజంగా అమెరికన్ల కోసం ఆలోచిస్తారు."

-- ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

కరోనా విషయంలోనూ...

ట్రంప్​ ప్రభుత్వం కరోనా నియంత్రణలోనూ విఫలమైందని ఆరోపించారు ఒబామా.

"రిపబ్లికన్​ హెల్త్​కేర్​ ప్రణాళిక​ విఫలమైంది. ఎనిమిది నెలలుగా మహమ్మారితో పోరాడుతున్నాం. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. డొనాల్డ్​ ట్రంప్​ మనందరినీ రక్షించేస్తారని అనుకుంటున్నారేమో. తనకోసం తానే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఫ్లోరిడా వ్యక్తే ఇలాంటి పనులు చేయరు. అలాంటిది అమెరికా అధ్యక్షుడి నుంచి ఇలాంటి బాధ్యతారహిత ప్రవర్తనను ఆమోదిస్తామా?"

-- ఒబామా, మాజీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: అమెరికా ఓటరు ఎటువైపు? 'విజేత'పై ఉత్కంఠ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.