ETV Bharat / international

ట్రంప్​ అభిశంసనపై విచారణ- నిర్దోషిగా తేలే అవకాశం!

author img

By

Published : Jan 27, 2021, 9:16 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రాట్లు సంధించిన అభిశంసన అస్త్రంపై సెనెట్​లో మంగళవారం రెండో దశ విచారణ ప్రారంభమైంది. ఈ విచారణను అడ్డుకోవడానికి రిపబ్లికన్​ సెనెటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. అభిశంసన తీర్మానానికి అవసరమైన మద్దతు కూడగట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారని తెలుస్తోంది.

Trump impeachment trial
ట్రంప్​ అభిశంసనపై విచారణ- రాజ్యాంగబద్ధం కాదన్న రిపబ్లికన్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై.. సెనెట్​లో రెండో దశ విచారణ మంగళవారం ప్రారంభమైంది. సెనెట్​ ప్రొటెం స్వీకర్​గా ప్రమాణ స్వీకారం చేసిన పాట్రిక్​ లీహి దీనిపై విచారణ చేపట్టారు. అభిశంసన ఆర్టికల్​ను ప్రతినిధుల సభ.. సెనెట్​కు సోమవారం పంపించింది. అమెరికాలో క్యాపిటల్​ భవనంపై ట్రంప్​ మద్దతుదారులు జరిపిన దాడికి బాధ్యుడు ట్రంపేనని డెమొక్రాట్లు ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 9 నుంచి ఇరు పక్షాలు తమ వాదనను వినిపించనున్నాయి.

విచారణ వద్దంటున్న రిపబ్లికన్లు..

ట్రంప్​ అభిశంసన విచారణ అడ్డుకోవడానికి రిపబ్లికన్​ సెనెటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ అభిశంసన.. రాజ్యాంగ విరుద్ధమంటూ కెంటకీకి చెందిన రిపబ్లికన్​ సెనెటర్​ ర్యాండ్​ పాల్​.. వాదిస్తున్నారు. అయితే.. ట్రంప్​ అభిశంసన చట్టబద్ధమేనంటూ ​ 55-45 ఓట్ల తేడాతో సెనెట్ అంగీకరించింది. టెక్సాస్​కు చెందిన మరో సెనెటర్​.. మాజీ అధ్యక్షులపై అభిశంసన విచారణ మొదలుపెడితే, మరి ఆ తర్వాత ఒబామాపై కూడా ఇదే తరహా చర్యలు ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు.

అభిశంసన నుంచి ​ తప్పించుకోనున్న ట్రంప్!

ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయే అవకాశం ఉందని.. అధికార వర్గాలు వెల్లడించాయి. అభిశంసన తీర్మానం ఆమోదానికి అవసరమైన రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు కూడగట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం 100 సీట్లున్న సెనెట్‌లో డెమొక్రాట్‌, రిపబ్లికన్‌ పార్టీలకు.. చెరో 50 మంది సభ్యులు ఉన్నారు.

ట్రంప్‌ అభిశంసన తీర్మానానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరంకాగా.. దానికి కనీసం 17 మంది రిపబ్లికన్ సెనెటర్ల మద్దతు అవసరం. ఈ మద్దతు కూడగట్టడంలో డెమొక్రాట్‌ పార్టీ విఫలమైనట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా అభిశంసన విచారణ ఎదుర్కొన్న మొదటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్.. ఈ ఏడాదిలోనే రెండోసారి నిర్దోషిగా బయటపడే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:ట్రంప్ కొత్త కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.