అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమెక్రాట్లు సంధించిన అభిశంసన అస్త్రం సోమవారం సెనేట్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది.
ఈ నెల 6న క్యాపిటల్‌పై దాడికి పాల్పడేలా తన మద్దతుదారులను ట్రంప్ ప్రేరేపించారన్న ఆరోపణలతో డెమొక్రాట్లు అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించారు. తొలుత ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ఈ అభిశంసనను సెనేట్ ముందుంచారు డెమొక్రాట్లు.
సెనేట్‌లో విచారణ జరిగితే... అధ్యక్షుడి పదవి నుంచి వైదొలిగాక అభిశంసనను ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తిగా ట్రంప్ నిలవనున్నారు. ఫిబ్రవరి 8న ట్రంప్‌పై విచారణ జరగనుంది.
దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.... విచారణ కచ్చితంగా జరిగి తీరాల్సిందే అని అన్నారు.
ఇదీ చదవండి:
'ట్రంప్ ఆదేశాలతోనే క్యాపిటల్‌పై దాడి చేశాం'