తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Social Media) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అకౌంట్‌ను తాత్కాలికంగా పునరుద్ధరించాలని కోరారు. (Donald Trump news) ఈ మేరకు ఫ్లోరిడాలోని ఓ జిల్లా కోర్టులో శుక్రవారం వ్యాజ్యం దాఖలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన ఒత్తిడి వల్లే తన ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని ట్రంప్ (Trump Twitter Account) ఆరోపించారు. సామాజిక మాధ్యమ ఖాతాల శాశ్వత పునరుద్ధరణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పిటిషన్ వేశారు ట్రంప్.
"దేశంలో రాజకీయ ప్రసంగాలను ట్విట్టర్ నియంత్రిస్తోంది. అది చరిత్రలో ఎన్నడూ జరగలేదు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలపై జులైలోనే వ్యాజ్యం దాఖలు చేశారు ట్రంప్. ఈ సంస్థల సీఈఓల స్థాయి ప్రభుత్వ వ్యక్తుల స్థాయికి మారిపోయిందని ఆరోపించారు. యూజర్లపై సెన్సార్షిప్ విధిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విఘాతం కలిగిస్తోందని పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ ఖాతాపై విధించింది సెన్సార్షిప్ కాదని ఫేస్బుక్, ట్విట్టర్ చెబుతున్నాయి. జనవరి 6న జరిగిన క్యాపిటల్ హింసాకాండను దృష్టిలో ఉంచుకొని ప్రజల సంక్షేమం మేరకే ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపాయి. బ్యాన్ సమయంలో ట్విట్టర్లో ట్రంప్‌నకు 8.8 కోట్ల మంది ఫాలోవర్లు (Trump Twitter Followers) ఉన్నారు.
ఇదీ చదవండి: