మరికొద్ది రోజుల్లో బ్రిటన్లో పర్యటించనున్న సందర్భంగా జాతీయ భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని బ్రిటన్కు సూచించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బ్రిటన్ 5జీ నెట్వర్క్ నిర్మాణంలో చైనా కంపెనీ హువావే జోక్యంపై జాగ్రత్తగా వ్యవహరించాలని స్నేహపూర్వకంగా హెచ్చరించారు. అమెరికా నిఘా వ్యవస్థ ఎంతో పటిష్టమైందని, బ్రిటన్ స్నేహపూర్వక దేశమైన కారణంగానే జాగ్రత్తగా ఉండాలనే సూచన చేస్తున్నట్లు ప్రకటించారు.
హువావే నెట్వర్క్ను చైనా ప్రభుత్వం నియంత్రిస్తోందని చాలా కాలంగా అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను హువావే సంస్థ, చైనా ప్రభుత్వం మీరుతున్నాయని ప్రకటించింది.
హువావే ద్వారా బ్రిటన్లో 5జీ నెట్వర్క్ను నిర్మించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి థెరెసా మే ప్రకటించారు.
బ్రిటన్ వ్యవహారాలపై..
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ తప్పుకోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు ట్రంప్. థెరెసా మే అనంతరం బ్రిటన్ మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవుతారని అంచనా వేశారు.
ఇదీ చూడండి: విశ్లేషణ కమిటీతో భేటీ కాని దిల్లీ అభ్యర్థులు