రెండోసారి అధ్యక్షుడవ్వాలన్న కల చెదిరిన వేళ.. ట్రంప్ తన మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఓటమికి పరోక్షంగా కారకులైన తన వర్గంలోని కొందరు అధికారులను ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రక్షణ మంత్రిగా పనిచేసిన మార్క్ టీ ఎస్పర్‌ను పదవి నుంచి తప్పించారు. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్.
ఎస్పర్ స్థానంలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మిల్లర్‌ను నియమించారు. పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్పర్ సేవలకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారు.
సాధారణంగా నూతన అధ్యక్షులు, రెండోసారి పదవి చేపట్టిన అధ్యక్షులు మాత్రమే కేబినేట్ సభ్యులు, రక్షణ మంత్రులను మార్చేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఓడిపోయి కేవలం రెండు నెలలే అధికారంలో ఉండే అధ్యక్షుడు పాత బృందాన్నే కొనసాగిస్తారు. అయితే ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇదే కారణమా..
ఎస్పర్ పదవి ఊడటానికి ట్రంప్‌తో సరైన సత్సంబంధాలు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది వేసవిలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను.. ఆయన పూర్తిస్థాయిలో నియంత్రించడంలో విఫలమయ్యారని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది.
బెకా ఒప్పందంలో కీలకంగా..
భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకంగా పేర్కొన్న బెకా ఒప్పందం గత నెలలోనే కుదిరింది. అయితే ఇది విజయవంతంగా పూర్తి కావడంలో రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్ కీలకంగా వ్యవహరించారు.
ఇదీ చూడండి: