2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు మనఫోర్ట్. అయితే... ఈ కేసుకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.
మాస్కోతో సంబంధాలున్న ఉక్రెయిన్ రాజకీయ నేతలతో మనఫోర్ట్ పదేళ్లు పని చేశారు. ఆ సమయంలో ఉక్రెయిన్ నేతలకు చెందిన 55 మిలియన్ డాలర్లను అక్రమంగా సైప్రస్‌లోని బ్యాంకుల్లో దాచిపెట్టారన్నది అభియోగం.
ఈ కేసులో మన్ఫోర్ట్తో పాటు ట్రంప్‌తో పనిచేసిన మరో ఐదుగురు మాజీ అధికారులపైనా అభియోగాలున్నాయి.
మనఫోర్ట్పై మరోకేసు విచారణ వచ్చేవారం జరగనుంది. నేరం రుజువైతే కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.